Tata Curvv SUV Coupe: టాటా నుంచి మరో కొత్త ఎస్యూవీ కార్.. ధర, ఫీచర్స్ ఇవే!

ఇటీవల కాలంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థలు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి మార్కెట్లోకి వివిధ ఎస్‌యూవీ లను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే టాటా మోటార్స్ కంపెనీ కర్వ్ ఎస్‌యూవీ పరిచయం చేసిన విషయం తెలిసిందే.

  • Written By:
  • Publish Date - July 21, 2024 / 12:00 PM IST

ఇటీవల కాలంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థలు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి మార్కెట్లోకి వివిధ ఎస్‌యూవీ లను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే టాటా మోటార్స్ కంపెనీ కర్వ్ ఎస్‌యూవీ పరిచయం చేసిన విషయం తెలిసిందే. డి సెగ్మెంట్లో భాగంగా ఈ కారు సత్తా చావడానికి సిద్ధంగా ఉంది. అయితే ఇప్పటికే డి సెగ్మెంట్లో బాగా పాపులర్ అయిన హ్యూందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా వంటి మోడళ్లతో ఈ టాటా కర్వ్ డైరెక్ట్ గా పోటీపడనుంది. ఇదిలా ఉంటే ఈ కారుకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

ఈ కర్వ్ డిజైన్ సమకాలీన టాటా ఎస్‌యూవీ మోడళ్ల మాదిరిగానే ఉంటుంది. ప్రాముఖ్యంగా బంపర్స్, హెడ్ ల్యాంప్స్, టాటా సిగ్నేచర్ ఎల్ఈడీ ఐబ్రో లైటింగ్ వంటివి ఉంటాయి. సైడ్ డోర్లు యూనిక్ పాప్ అవుట్ డోర్ హ్యాండిళ్లను కలిగి ఉంటాయి. పెటల్ ఆకారం లోని అల్లాయ్ వీల్స్ ఉంటాయి. 2024 భారత్ మొబలిటీ ఎక్స్ పో లో ప్రదర్శించిన మాదిరిగానే ఈ కారు డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంది. కాగా ఈ కారు ఇంటీరియర్ గురించి ఇంకా పూర్తి స్థాయిలో రివీల్ కాలేదు. అయితే నెక్సాన్, హ్యారియర్ వేరియంట్ల మాదిరిగానే ఇది ఉండే అవకాశం ఉంది. అలాగే అడ్వాన్స్ డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ ఫీచర్ లెవెల్ 2 కేపబులిటీతో ఉంటుంది. 360 డిగ్రీల కెమెరా పార్కింగ్ ను సులభతరం చేస్తుంది.

కాగా ఈ కారు రెండు ఇంజిన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. మొదటిది 1.2 లీటర్ జీడీఐ టర్బో పెట్రోల్ యూనిట్. ఇది 123 బీహెచ్పీ 225ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. సిక్స్-స్పీడ్ మాన్యువల్, సెవెన్ స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్ మిషన్ ఉంటుంది. అలాగే డీజిల్ వేరియంట్ వచ్చేసరికి 1.5 లీటర్ ఇంజిన్, 113 బీహెచ్పీ, 260ఎన్ఎం టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. దీనిలో సిక్స్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్సిమిషన్, సిక్స్ స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఉంటుంది. ఇకపోతే ఈ కారు ధర గురించి ఆగస్టు 7వ తేదీ వెల్లడించినట్లు కంపెనీ తెలిపింది.

Follow us