Site icon HashtagU Telugu

Tata Curvv EV Bookings: మొదలైన టాటా కర్వ్ ఈవీ బుకింగ్స్.. తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్స్!

Tata Curvv Ev Bookings

Tata Curvv Ev Bookings

మీరు కూడా టాటా కర్వ్ ఈవీ కారును కొనుగోలు చేయాలనుకుంటున్నారా. అయితే మీకు చక్కటి శుభవార్త. ఎందుకంటే ఈ కారును బుక్ చేసుకోవడానికి సమయం వచ్చేసింది. ఆగస్టు 12 నుంచి ఈ కారుకు సంబంధించిన బుకింగ్స్ మొదలయ్యాయి. కాగా ఇటీవల కర్వ్ ఈవీ ని మార్కెట్‌లో గ్రాండ్‌గా విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ కారు బుకింగ్స్ ఎప్పుడెప్పుడు అందుబాటులోకి వస్తాయా ఎప్పుడు మొదలవుతాయా అని వాహన వినియోగదారులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూశారు. ఆ సమయం రానే వచ్చేసింది. ఇప్పటికే ఈ కారు బుకింగ్స్ కూడా మొదలయ్యాయి.

కాగా ఈ ఈవీ కారు స్టైలింగ్, ఆకర్షణీయమైన ఫీచర్లతో కూడి ఉంది. మరి ఈ కారుకు సంబంధించిన మరిన్ని వివరాల విషయానికొస్తే.. టాటా కర్వ్ ఈవీ కొనాలి అనుకుంటే కస్టమర్‌లు సరికొత్త కర్వ్ ఎలక్ట్రిక్ కారును ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. లేదంటే మీ సమీపంలోని టాటా డీలర్‌షిప్‌ ని సందర్శించాలి. రూ.21,000 ముందస్తు చెల్లింపు చేసి బుక్ చేసుకోవచ్చు. ఆగస్టు 14న టెస్ట్ డ్రైవ్ ప్రారంభం కాగా ఆగస్టు 23 నుంచి డెలివరీలు మెుదలవుతాయి. కాగా టాటా కర్వ్ EV ధర రూ. 17.49 లక్షల నుండి రూ. 21.99 లక్షల ఎక్స్ షోరూమ్‌గా ఉంది. ఇందులో క్రియేటివ్, అకాంప్లిష్డ్, అకాంప్లిష్డ్ ప్లస్ ఎస్, ఎంపవర్డ్ ప్లస్, ఎంపవర్డ్ ప్లస్ ఎ లాంటి 5 వేరియంట్‌ లు కూడా ఉన్నాయి.

ఇది ఫ్లేమ్ రెడ్, ఎంపవర్డ్ ఆక్సైడ్, ప్రిస్టైన్ వైట్, ప్యూర్ గ్రే లాంటి రంగులలో లభించనుంది. అలాగే ఈ కారులో రెండు బ్యాటరీ ప్యాక్‌లు ఉన్నాయి. 45 kWh బ్యాటరీని కలిగి ఉన్న వేరియంట్ పూర్తి ఛార్జ్‌పై 502 కిలో మీటర్ల మైలేజీ అందిస్తుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 150 PS పవర్, 215 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 55 Kwh బ్యాటరీ ప్యాక్‌ ని పొందే వేరియంట్ పూర్తి ఛార్జ్‌తో 585 కిలోమీటర్లు ప్రయాణించగలదు. దీని ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 167 PS శక్తిని, 215 Nm గరిష్ట టార్క్‌ని విడుదల చేయగలదు. DC ఫాస్ట్ ఛార్జింగ్ ఎంపికపై కర్వ్ EV బ్యాటరీ 10 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేయడానికి 40 నిమిషాలు పడుతుంది. అలాగే ఈ కొత్త కర్వ్ కారులో ఐదుగురు ప్రయాణించవచ్చు. ఇందులో 12.3 అంగుళాల టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, ఎయిర్ ప్యూరిఫైయర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, 9 స్పీకర్ JBL-సౌండ్ సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వంటి చాలా ఫీచర్ లను అందించారు..