Site icon HashtagU Telugu

Revolt RV400: ఒక్క రూపాయి కూడా కట్టకుండా రివోల్ట్ బైక్ ని పొందువచ్చట.. అదెలా అంటే?

Mixcollage 15 Jul 2024 10 24 Am 2641

Mixcollage 15 Jul 2024 10 24 Am 2641

ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రివోల్ట్ తన అమ్మకాలను పెంచుకోవడానికి తన ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడానికి, వినియోగదారులను మరింత ఆకర్షించడం కోసం ఇప్పటికే కొత్త కొత్త స్కీంలను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. తాజాగా కూడా మరో కొత్త ఫైనాన్స్ స్కీమ్‌ తో ముందుకు వచ్చింది. తాజాగా తీసుకువచ్చిన ఈ ఫైనాన్స్ స్కీమ్ తో వినియోగదారులు జీరో డౌన్ పేమెంట్‌ తో రివోల్ట్ ఆర్వి 400 ఎలక్ట్రిక్ బైక్‌లను కొనుగోలు చేయవచ్చు.

ఇందుకోసం కస్టమర్లు నెలకు రూ.4,444 మాత్రమే ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. కస్టమర్లకు సంపాదన సర్టిఫికేట్ చూపించాల్సిన అవసరం కూడా లేదు. ప్రాసెసింగ్ ఫీజు, స్టాంప్ డ్యూటీ కూడా కస్టమర్ల నుంచి వసూలు చేయరు. ఈ మొత్తం ప్రక్రియను కంపెనీ కాగిత రహితంగా చేస్తుంది అంటే డిజిటల్ ప్రాసెస్ ద్వారా కస్టమర్లు ఈ స్కీమ్ ప్రయోజనాన్ని పొందవచ్చన్నమాట. కాగా రివోల్ట్ సంస్థ ఇటీవల కాలంలో తన అమ్మకాలను పెంచడానికి అలాగే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను మార్కెట్లో వేగవంతంగా తీసుకెళ్లడానికి తరచుగా ఇలాంటి ఫైనాన్స్ స్కీములను అందిస్తోంది. కాగా ఈ ఏడాది మేలో అమల్లోకి వచ్చిన ఆర్వీ400 స్టాండర్డ్, బీఆర్జెడ్ మోడళ్లపై రూ.5,000 ధరను తగ్గించింది.

అలాగే ఈ బైక్ పై రూ.10,000 అదనపు డిస్కౌంట్, రూ.5,000 ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా లభిస్తుంది. ఇకపోతే ఈ రివోల్ట్ ఆర్వీ400 ఈవీ ఫీచర్లు, స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. రివోల్ట్ ఆర్వీ400 ఈవీ మోటార్ సైకిల్ 3 కిలోవాట్ల మోటార్, 72వీ, 3.24 కిలోవాట్ల లిథియం అయాన్ బ్యాటరీతో జతచేసి ఉంటుంది. ఈ బైక్ గరిష్ట వేగం గంటకు 85 కిలో మీటర్లు. ఈ బైక్ ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు 150 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. సాధారణ 15ఏ సాకెట్ నుంచి పూర్తిగా ఛార్జ్ కావడానికి 4 గంటల సమయం పడుతుంది.అలాగే ఈ బైక్ ఎకో, నార్మల్, స్పోర్ట్ అనే మూడు రైడింగ్ మోడ్ లను కలిగి ఉంది. సస్పెన్షన్ సిస్టమ్‌లో ముందు భాగంలో అప్ సైడ్ డౌన్ ఫోర్కులు, వెనుక భాగంలో పూర్తిగా సర్దుబాటు చేయగల మోనోషాక్స్ ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఆధారంగా రూపొందించిన భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్ కూడా ఇదే.