Tata Nexon: కేవలం రూ.13 వేలకే టాటా నెక్సన్ కారును సొంతం చేసుకోవచ్చట.. అదెలా అంటే?

మామూలుగా సామాన్య ప్రజలు చిన్న సైజు కారు అయినా కొనుగోలు చేయాలని అనుకుంటూ ఉంటారు. కానీ వాటి ధర కారణంగా చాలామంది వెనుకడుగు వేస్తూ ఉంటారు. త

  • Written By:
  • Publish Date - January 19, 2024 / 08:00 PM IST

మామూలుగా సామాన్య ప్రజలు చిన్న సైజు కారు అయినా కొనుగోలు చేయాలని అనుకుంటూ ఉంటారు. కానీ వాటి ధర కారణంగా చాలామంది వెనుకడుగు వేస్తూ ఉంటారు. తక్కువ బడ్జెట్ లో కార్ల కోసం వెతుకుతూ ఉంటారు. అందుకే ఎక్కువగా పండుగ ఆఫర్లు ఏవైనా ఆఫర్స్ ఉన్న సమయంలోనే కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే మీరు కూడా అలా తక్కువ బడ్జెట్ లో మంచి కారు కొనుగోలు చేయాలనుకుంటున్నారా. అయితే మీకు ఇది ఒక గొప్ప సువర్ణ అవకాశం అని చెప్పవచ్చు. కేవలం 13 వేలకే టాటా నెక్సన్ కారును సొంతం చేసుకోవచ్చట.. మరి అది ఎలా సాధ్యమో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కాగా ప్రస్తుతం మార్కెట్లో ఎక్కువగా అమ్ముడుపోయే కార్లలో టాటా నెక్సన్ ఒకటి. ఇది 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో వస్తుంది. అంతేకాకుండా ఈ కారులో ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. ఇది చాలా పవర్ పుల్ ఇంజిన్ తో వస్తుంది. ఎక్కువ మైలేజిని ఇస్తుంది. సేప్టీ విషయంలో దీనికి తిరుగులేదు. ఇది 6 ఎయిర్‌బ్యాగ్‌లను కలిగి ఉంది. అంతేకాకుండా 360 డిగ్రీ కెమెరా, వెనుక పార్కింగ్ సెన్సార్, ABS, EBD, చైల్డ్ లాక్, ISOFIX చైల్డ్ సీట్లు వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. 10.25 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, క్లైమేట్ కంట్రోల్ ఏసీ , వెనుక ఏసీ వెంట్స్, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి అనేక ప్రీమియం ఫీచర్లు కూడా కారులో కనిపిస్తాయి. కారు ఇంజిన్‌లో కంపెనీ ఎలాంటి మార్పులు చేయలేదు.

ఇది పెట్రోల్, డీజిల్ ఇంజన్లతో నడుస్తోంది.1.2 లీటర్ కలిగిన పెట్రోల్ ఇంజిన్ 22 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇస్తుంది. అదే 1.5 లీటర్ కలిగిన డీజిల్ ఇంజిన్ కారు లీటరుకు 28 కిలోమీటర్ల వరకు వస్తుంది. మీరు టాటా నెక్సాన్ బేస్ మోడల్‌ని కొనుగోలు చేస్తే.. దాని ఎక్స్-షోరూమ్ ధర రూ. 8,09,990. మీరు ఢిల్లీలో అయితే ఆన్ రోడ్ దీనిని రూ. 9,09,253 ధరకు పొందుతారు. ఇప్పుడు మీరు దీనిపై రూ. 1 లక్ష డౌన్‌పేమెంట్ చేస్తే మీకు రూ. 8,09,253 ధరతో కారు లోన్ లభిస్తుంది. 9 శాతం వడ్డీ రేటుతో 7 సంవత్సరాల పాటు రుణం తీసుకుంటే, మీరు ప్రతి నెలా EMIగా రూ. 13,020 చెల్లించాలి. మీరు 7 సంవత్సరాలలో మొత్తం రూ.10,93,691 చెల్లించాలి. ఇందులో మీకు రూ.2,84,438 వడ్డీగా ఇస్తారు. అయితే, మీరు బ్యాంక్ నిబంధనలు మీ క్రెడిట్ స్కోర్ ఆధారంగా మాత్రమే కారు లోన్ పొందుతారు.