Site icon HashtagU Telugu

Hydrogen Engines : ఇక విమానాల కోసం ‘హైడ్రోజన్‌’ ఇంజిన్లు.. రెడీ చేస్తున్న సైంటిస్టులు

Hydrogen Engines For Airplanes Switzerland

Hydrogen Engines :  హైడ్రోజన్‌ ఇంధనంతో నడిచే విమానాల ఇంజిన్లు రెడీ అవుతున్నాయి. వీటిని స్విట్జర్లాండ్‌లోని ఈటీహెచ్‌ జ్యూరిచ్ సంస్థకు చెందిన సైంటిస్టులు అభివృద్ధి చేస్తున్నారు. మధ్యశ్రేణి విమానాల కోసం హైడ్రోజన్‌ ఇంజిన్లు తయారు చేసే పరిశ్రమలు, విశ్వవిద్యాలయాలకు సహాయాన్ని అందించేందుకు ఒక ప్రాజెక్టును యూరోపియన్ యూనియన్ గత ఏడాది ప్రారంభించింది. ఇందులో భాగంగా స్విట్జర్లాండ్‌లోని ఈటీహెచ్‌ జ్యూరిచ్ సంస్థలో ఒక ప్రత్యేక పరిశోధనా కేంద్రాన్ని(Hydrogen Engines) ఏర్పాటు చేశారు. జీఈ ఏరోస్పేస్‌ సంస్థతో ఈటీహెచ్‌ జ్యూరిచ్ సంస్థ కలిసి అభివృద్ధి చేసిన హైడ్రోజన్‌ ఇంజెక్షన్‌ నాజిల్స్‌ను ఈ కేంద్రంలోనే పరీక్షిస్తున్నారు. ఇందులో హైడ్రోజన్ ఇంజిన్ల మోడళ్లను  అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటికే  అభివృద్ధి చేసిన వాటిని టెస్టింగ్ చేస్తున్నారు.

Also Read :Mens Day 2024 : నేడే మెన్స్ డే.. ఒక్క పురుషుడు.. ఎన్నో పాత్రలు

ప్రస్తుతం విమానాల్లో వినియోగంలో ఉన్న ఇంజిన్లు కిరోసిన్‌‌తో  ప్రజ్వలన పొందుతాయి. ఒకవేళ హైడ్రోజన్‌‌తో ఇంజిన్‌కు ప్రజ్వలన అందించే  ఏర్పాటు జరిగితే.. ఇంజిన్‌లో అంతర్గతంగా ప్రకంపనలు వస్తాయి. ఆ ప్రకంపనలు ఏ స్థాయిలో  ఉంటాయి అనేది ఈటీహెచ్‌ జ్యూరిచ్ సంస్థ పరిశోధకులు ప్రస్తుతం కొలుస్తున్నారు. వాటిని తగ్గించేందుకు ఏం చేయాలనేది ఆలోచిస్తున్నారు. హైడ్రోజన్‌తో తయారు చేసే విమాన ఇంజిన్‌లోని వివిధ దహన చర్యల ఛాంబర్లలో ధ్వనులు ప్రయాణించే తీరుపైనా సైంటిస్టులు స్టడీ చేస్తున్నారు.

Also Read :Singareni : సింగరేణి మరో కొత్త వ్యాపారం.. కార్బన్‌ డయాక్సైడ్‌ నుంచి మిథనాల్‌ తయారీ

కిరోసిన్‌ కన్నా హైడ్రోజన్‌ చాలా త్వరగా మండుతుంది. అందువల్ల హైడ్రోజన్ ఇంజిన్‌లో చిన్నచిన్న  జ్వాలలు వచ్చేలా సెట్టింగ్స్ చేస్తున్నారు.ఈ జ్వాలల ప్రభావంతో ఏర్పడే ప్రకంపనల వల్ల హైడ్రోజన్ ఇంజిన్‌ ఛాంబర్‌పై పెనుభారం పడుతుంది. ఫలితంగా అందులో పగుళ్లు ఏర్పడతాయయి. ఇంజిన్‌ దెబ్బతింటుంది. ఇవన్నీ జరగకుండా ఉండేందుకు ప్రకంపనలను కంట్రోల్ చేసే టెక్నాలజీని తయారు చేయడంలో ఇప్పుడు సైంటిస్టులు నిమగ్నమయ్యారు. రాబోయే కొన్నేళ్లలో విమానాల్లో వాడేందుకు అనువైన హైడ్రోజన్ ఇంజిన్ రెడీ అవుతుందని శాస్త్రవేత్తలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల విమానాల రాకపోకలతో జరుగుతున్న పర్యావరణ కాలుష్యం తగ్గుముఖం పడుతుందని అంటున్నారు.