ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ మారుతీ సుజుకి గురించి మనందరికి తెలిసిందే. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో మారుతి సుజుకి కార్లు కూడా ఒకటి. ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేసిన వాహనాలతో పాటు ఎప్పటికప్పుడు కొత్త కొత్త వాహనాలను విడుదల చేస్తూ ఉంటుంది. ఇకపోతే ఈ కంపెనీ నుంచి విడుదల కానున్న మారుతీ సుజుకి ఈవీక్స్ పై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ కంపెనీ నుంచి విడుదల అవుతున్న మొట్ట మొదటి కారు ఇదే. మరి ఆ వివరాల్లోకి వెళితే..
కాగా మారుతీ సుజుకీ ఎలక్ట్రిక్ కారును ఇప్పటికే అనేక ఆటో షోలలో చాలా సార్లు ప్రదర్శించిన విషయం తెలిసిందే. మారుతీ సుజుకీ ప్రతిష్టాత్మకంగా విడుదల చేస్తున్న మొదటి ఎలక్ట్రిక్ వాహనం కూడా ఇదే కావడం విశేషం. ఈ కొత్త కారుకు ఎస్కుడో అని పేరు పెట్టవచ్చని తెలుస్తోంది. ఇకపోతే ఈ కారుకు సంబందించిన వివరాల్లోకి.. ఈ కారులో విభిన్న అవసరాలను తీర్చడానికి రెండు రకాల బ్యాటరీ ప్యాక్ లను కూడా అమర్చారు. అందులో ఒకటి 40 కేడబ్ల్యూహెచ్, రెండోది 60 కేడబ్ల్యూహెచ్ సామర్థ్యంతో పని చేస్తాయి. వాటిలో 40 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ వాహనం మన దేశంలో అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు.
ఇంకా ప్రత్యేకంగా కావాలనుకునే వారికి 60 కేడబ్ల్యూహెచ్ వీలుగా ఉంటుంది. ఈ వాహనం అంతర్జాతీయ మార్కెట్లలో ఆధిపత్యం చెలాయిస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను ఆకట్టుకోవడానికి సుజుకీ కంపెనీ తన ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకువస్తోంది. ముందుగా సుజుకి ఎస్కుడోతో రానుంది. అలాగే టయోటా మోటార్ కార్పొరేషన్ తో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుంది. ఎలక్ట్రిక్ వాహనాలను మరింత అభివృద్ధి చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఇది బ్యాటరీ, అభివృద్ధి ఖర్చులను గణనీయంగా తగ్గిస్తుంది. ఈ కారు డిజైన్ ప్రస్తుతం ఆకట్టుకుంటోంది. కాగా ఈ కారు బయట డిజైన్ లో కొత్త ట్రై ఏరో ఎల్ఈడీ డీఆర్ ఎల్, స్లీక్ హెడ్ లైట్లు, అప్ డేటెడ్ ఓఆర్వీఎమ్, స్పోర్ట్ బంపర్ ఏర్పాటు చేశారు. సైడ్ ప్రొఫల్ లో ప్రోమినెంట్ వీల్ ఆర్చ్, అల్లాయ్ వీల్స్, ఫ్లస్ టైప్ డోర్ హ్యాండిల్ అమర్చారు. సుజుకి ఎస్కుడో మన దేశంతో పాటు యూరోప్, జపాన్లలో అందుబాటులో ఉంటుంది. ఈ ఈవీ కారును 2025 జనవరిలో మార్కెట్ లోకి విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.