Cars Crash Test : కార్ల‌కు `క్రాష్ టెస్ట్` ఇక ఇండియాలోనే..!

  • Written By:
  • Publish Date - June 24, 2022 / 04:30 PM IST

భార‌త ఆటోమొబైల్ రంగానికి కేంద్ర మంత్రి గ‌డ్క‌రీ శుభ‌వార్తను వినిపించారు. ఇక నుంచి కార్లను క్రాష్ టెస్ట్ కోసం గ్లోబల్ ఎన్ సీఏపీ టెస్టింగ్ కోసం పంపాల్సిన అవసరం లేద‌ని ప్ర‌క‌టించారు. భారత్ లోనే ఎన్ సీఏపీ కార్యకలాపాలను భార‌త్‌ మొదలు పెడుతుందని వెల్ల‌డించారు.‘‘భారత్ ఎన్ సీఏపీ ఏర్పాటుకు సంబంధించి ముసాయిదా నోటిఫికేషన్ నకు ఆమోదం ల‌భించింది. క్రాష్ పరీక్షల్లో చూపించిన పనితీరు ఆధారంగా వాహనాలకు రేటింగ్ లు ఇస్తాం. స్టార్ రేటింగ్ ల ఆధారంగా కస్టమర్లు సురక్షితమైన కారును ఎంపిక చేసుకోవడానికి వీలుంటుంది. దీంతో సురక్షితమైన కార్లను తయారు చేసే విషయంలో కంపెనీల మధ్య ఆరోగ్యకర పోటీని ప్రోత్సహించినట్టు అవుతుంది. అంతేకాదు భారత వాహనాల ఎగుమతి సామర్థ్యాలను కూడా పెంచుతుతుంది’’అని మంత్రి ట్వీట్ చేశారు.

‘న్యూ కార్ అసెస్ మెంట్ ప్రొగ్రామ్’ నే ఎన్ సీఏపీగా పిలుస్తుంటారు. కొత్త కార్లకు సంబంధించి సామర్థ్య పరీక్షలు నిర్వహించి రేటింగ్ ఇవ్వడం ఎన్ సీఏపీ చేసే ప‌ని. భారత్ ఎన్ సీఏపీకి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసినట్టు మంత్రి గడ్కరీ ట్విట్టర్ వేదికగా తెలిపారు.