Site icon HashtagU Telugu

Ola CEO Vs Comedian : ఓలా సీఈఓ వర్సెస్ కమేడియన్ కమ్రా ట్వీట్ల యుద్ధం

Ola Ceo Bhavish Aggarwal Comedian Kunal Kamra

Ola CEO Vs Comedian : కమేడియన్ కునాల్ కమ్రా‌పై ఓలా సీఈఓ భవీష్ అగర్వాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ల టెక్నికాలిటీలపై అనవసర వ్యాఖ్యలు చేయకుండా కామ్‌గా ఉండాలని కునాల్ క్రమాకు ఆయన హితవు పలికారు. ఈమేరకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఈ ఇద్దరి మధ్య వాగ్యుద్ధం జరిగింది.

  • ఓలా కంపెనీ సర్వీస్ సెంటర్ల పనితీరు బాగా లేదంటూ కమేడియన్ కునాల్ కమ్రా(Ola CEO Vs Comedian) ఎక్స్‌లో ఒక పోస్ట్ చేశారు. పెద్ద సంఖ్యలో ఓలా స్కూటర్లను ఓలా సర్వీస్ సెంటరు దగ్గర పార్కింగ్ చేసిన ఒక ఫొటోను ఈ పోస్టుకు కమ్రా జతపరిచారు.   ‘‘భారత కస్టమర్లకు మాట్లాడే అవకాశం ఉందా ? వారికి ఆ ఛాన్స్ ఇస్తున్నారా ? టూ వీలర్లు అనేవి సామాన్యుల జీవితంలో ఒక కీలక భాగం. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లలో సమస్యలు తలెత్తిన వారు తప్పకుండా ఈ పోస్టు కింద కామెంట్స్‌ను ట్యాగ్ చేయండి’’  అని కునాల్ కమ్రా తన పోస్టులో కోరారు. దీనికి స్పందించిన ఒక నెటిజన్.. ‘‘ఓలా సర్వీసు సెంటర్లలో దారుణమైన పరిస్థితి ఉంది. సర్వీస్ బాగా లేదు’’ అని చెప్పుకొచ్చాడు.  దీనికి కునాల్ కమ్రా బదులిస్తూ.. ‘‘ఔను.. కస్టమర్ల సమస్యలకు బదులిచ్చే వారే కరువయ్యారు’’ అని చెప్పారు.
  • చివరకు ఈ తరుణంలో ఓలా సీఈఓ భవీష్ అగర్వాల్ రియాక్ట్ అవుతూ.. ‘‘కునాల్ కమ్రా చేసింది పెయిడ్ ట్వీట్’’ అని ఆరోపించారు. ‘‘కునాల్ మీకు చేతనైతే ఓలా కస్టమర్ల సమస్యలను పరిష్కరించే విషయంలో మాకు సహకరించండి. ఈ పెయిడ్ ట్వీట్ కోసం మీరు తీసుకున్న దాని కంటే ఎక్కువ మొత్తాన్ని ఇవ్వడానికి నేను రెడీ. లేదంటే నోరు మూసుకొని మీరు కామ్‌గా కూర్చోండి. మీరు కమేడియన్‌గా ఫెయిలయ్యారు’’ అని భవీష్ అగర్వాల్ ధ్వజమెత్తారు.  ‘‘మేం మా కస్టమర్ల సౌకర్యం కోసం సర్వీసు సెంటర్ల నెట్‌వర్క్‌ను మరింతగా పెంచబోతున్నాం. కస్టమర్ల అన్ని సమస్యలను వేగవంతంగా పరిష్కరిస్తాం’’ అని ఆయన వెల్లడించారు.
  • ఓలా సీఈఓ భవీష్ ట్వీట్‌పై కునాల్ కమ్రా మండిపడ్డారు. ఓలా సర్వీసు సెంటర్ల వైఫల్యంపై తాను చేసిన ట్వీట్‌కు డబ్బులు పుచ్చుకున్నట్లు నిరూపించగలరా అని ఆయన ప్రశ్నించారు. ‘‘ఒకవేళ నేను డబ్బులు తీసుకొని ఈ ట్వీట్ చేసినట్లు నిరూపిస్తే.. నా సోషల్ మీడియా అకౌంట్లన్నీ డిలీట్ చేసి  కామ్‌గా కూర్చుంటాను’’ అని కునాల్ కమ్రా స్పష్టం చేశారు.
  • దీనికి ఓలా సీఈఓ కౌంటర్ ఇస్తూ..  ‘‘నేను చెప్పిన మాటలతో గాయమైందా ? మీతో చాలా పని ఉంది. మా ఓలా సర్వీసు సెంటరుకు వచ్చేయండి. మీ ఫ్లాప్ షోకు వచ్చే డబ్బుల కంటే ఎక్కువే ఇస్తాను.  మీ ఆడియన్స్‌పై  నిజంగానే అభిమానం ఉంటే మాతో కలిసి పనిచేయండి’’ అని కమ్రాను  కోరారు.
  • ఈ తరుణంలో కునాల్ కమ్రా రియాక్ట్ అవుతూ..  ‘‘నాకు ఆఫర్లు ఇవ్వడం ఆపేసి.. నాలుగు నెలల క్రితమే కొన్న ఓలా పాత ఈవీని రిటర్న్ ఇచ్చేందుకు వస్తున్న కస్టమర్లకు మొత్తం డబ్బులను రీఫండ్ చేయడంపై ఫోకస్ చేయండి.  నాకు మీ డబ్బులు అక్కర్లేదు. కస్టమర్లకు మీ పని అక్కర్లేదు. మీ జవాబుదారీతనం కావాలి’’ అని సూచించారు.
  • మళ్లీ దీనికి ఓలా సీఈఓ రియాక్ట్ అవుతూ.. ‘‘మా కస్టమర్లకు ఎలా సేవ చేయాలో మాకు తెలుసు. అందుకోసం చాలానే ఏర్పాట్లు చేస్తున్నాం. మీకు నిజంగా మా కస్టమర్ల గురించి ఆందోళన ఉంటే.. ఓలాతో చేతులు కలపండి. కుర్చీలో కూర్చొని విమర్శలు చేయడం ఆపేయండి’’ అని కునాల్ క్రమాకు హితవు పలికారు.