Site icon HashtagU Telugu

Electric scooter: మార్కెట్ లోకి మరో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్క ఛార్జ్‌ తో 150 కి.మీలు ప్రయాణం?

Mixcollage 17 Dec 2023 01 36 Pm 1044

Mixcollage 17 Dec 2023 01 36 Pm 1044

ప్రస్తుత రోజుల్లో వాహనా వినియోగదారులు ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గుచూపుతున్నారు. దాంతో రోజురోజుకీ మార్కెట్ లో ఎలక్ట్రిక్ వాహనాలకు ఉన్న క్రేజ్ డిమాండ్ విపరీతంగా పెరిగిపోతోంది. ఇక వాహన తయారీ సంస్థలు కూడా అందుకు అనుగుణంగానే సరికొత్త ఫీచర్లు కలిగిన ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. అయితే ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదలైన విషయం తెలిసిందే. తాజాగా కూడా మరో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ని భారత మార్కెట్లోకి లాంచ్ చేశారు. ఇంతకీ ఆ బైక్ ఏది? ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర, ఫీచర్ల విషయానికి వస్తే..

తాజాగా భారత ఆటో మొబైల్ మార్కెట్లోకి డాట్‌ వన్‌ పేరుతో ఒక సరికొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను లాంచ్‌ చేశారు. లాంచింగ్‌ ఆఫర్‌లో భాగంగా ఈ స్కూటర్‌ను రూ. 99,999గా నిర్ణయించారు. అయితే ముందుగా బుక్‌ చేసుకున్న వారికి మాత్రమే ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. తర్వాత ధర పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ బుకింగ్స్‌ ప్రారంభం అయ్యాయి. త్వరలోనే స్కూటర్ లను డెలివరీ చేయనున్నారు. ఇకపోతే ఈ స్కూటర్‌ ఫీచర్ల విషయానికొస్తే.. ఈ సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఒక్కసారి ఫుల్‌ ఛార్జ్ చేస్తే చాలు 160 కి.మీలు రేంజ్‌ అందిస్తుంది. అయితే వాతావరణ పరిస్థితులు, రోడ్డు ఆధారంగా కనీసం 151 కిమీ మైలేజ్‌ ఇస్తుందని సమాచారం. ఇక ఈ స్కూటర్‌లో 3.7 కిలో వాట్స్‌ కలిగిన బ్యాటరీని అందించారు.

పికప్‌ విషయంలోనూ ఈ స్కూటర్‌ మంచి పర్ఫామెన్స్‌ అందిస్తుందని కంపెనీ చెబుతోంది. కేవలం 2.77 సెకన్లలోనే గంటకు 0 నుంచి 40 కిమీల వరకు వేగాన్ని పుంజుకుంటుంది. ఇందులో అందించిన 8.5 కిలో వాట్‌ ఎలక్ట్రిక్‌ మోటర్‌, 72 న్యూటన్‌ మీటర్‌ టార్క్‌ను అందిస్తుంది. డాట్‌ వన్‌ స్కూటర్‌లో 35 లీటర్ల అండర్‌ సీట్‌ స్టోరేజ్‌ను అందించారు. ఇక డిజైన్ పరంగా కూడా ఈ స్కూటర్‌ను స్పోర్టివ్‌ లుక్‌లో తీసుకొచ్చారు. ఇందులో 8500 మోటర్‌ పవర్‌ను అందించారు. 105 కిలోమీటర్ల టాప్‌ వేగంతో దూసుకుపోతుంది. స్కూటీ 0 నుంచి 80 శాతం ఛార్జింగ్ కావడానికి 3 గంటల 47 నిమిషాలు పడుతుంది.