Site icon HashtagU Telugu

Electric Car: ఎలక్ట్రిక్ వాహనాల్లో ఇంజిన్ ఆయిల్‌ పోయవచ్చా.. ఇందన కారుకి దీనికి తేడా ఏంటో తెలుసా?

Mixcollage 15 Dec 2023 02 14 Pm 4773

Mixcollage 15 Dec 2023 02 14 Pm 4773

ఇటీవల కాలంలో పెట్రోల్ డీజిల్ ధరలు పూర్తిగా పెరిగిపోవడంతో వాహనదారులు ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. దీంతో రోజురోజుకీ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకి ఉన్న క్రేజ్ డిమాండ్ విపరీతంగా పెరిగిపోతోంది. అయితే కస్టమర్ల డిమాండ్‌కు అనుగుణంగా కార్ల తయారీ కంపెనీలు కూడా కొత్త ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెడుతున్నాయి. ఈ కార్ల కొనుగోలుదారులకు వాటి నిర్వహణకు సంబంధించి ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. ముఖ్యంగా పెట్రోల్ లేదా డీజిల్‌తో నడిచే కారులాగా ఎలక్ట్రిక్ కారులో ఇంజన్ ఆయిల్ పోయాల్సిన అవసరం ఉంటుందా అనే ప్రశ్న చాలా మందికి ఉంటుంది.

ఈ విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఎలక్ట్రిక్ కార్లు ఎలక్ట్రిక్ వెహికల్ ఇంజన్ ని ఉపయోగిస్తాయి. పెట్రోల్ డీజిల్‌తో నడిచే కార్లు ఉపయోగించే ICE ఇంజిన్‌ల కంటే ఇవి చాలా భిన్నంగా ఉంటాయి. ICE ఇంజిన్ వివిధ భాగాలతో ఉంటుంది. ఇవన్నీ కలిసి కారు కదిలేలా చేయాలి. కానీ ఎలక్ట్రిక్ కార్లలోని మోటార్లు చాలా భాగాలతో ఉండవు. అందుకే ఎలక్ట్రిక్ కార్ ఇంజిన్‌కు ఆయిల్ అవసరం లేదు. ఇంజిన్ వేడెక్కడం, ఇంజిన్ దెబ్బతినకుండా ఉండడానికి ICE ఇంజిన్‌ను ఉపయోగించినప్పుడు మాత్రమే ఆయిల్ వేయడం అవసరం. ఎలక్ట్రిక్ వెహికల్ ఇంజన్లు ఎక్కువగా గాలితో చల్లబడేవి కాబట్టి, అవి సరిగ్గా పనిచేయడానికి ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు.

పెట్రోల్ డీజిల్ కారులాగా ఎలక్ట్రిక్ కారు ఇంజన్ ఆయిల్‌ని మార్చాల్సిన అవసరం లేదు కాబట్టి, ఎలక్ట్రిక్ కార్ల యజమానులు ఇంజన్ ఆయిల్ ధరను ఆదా చేసుకోవచ్చు. అయితే, ఎలక్ట్రిక్ కారు మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటుందని అనుకోకండి. ఎలక్ట్రిక్ కార్ల తయారీదారు అందించిన మార్గదర్శకాల ప్రకారం ఎల్లప్పుడూ కారు కండిషన్ చెక్ చేయండి.