Site icon HashtagU Telugu

Hero Motorcycle Price Hike: పండగ ముందు హీరోమోటార్ సైకిల్ కస్టమర్లకు షాక్…ఎందుకో తెలుసా..?

Twitter

Twitter

భారతీయులు అత్యధికంగా ఇష్టపడే వాహనతయారీదారుసంస్థ హీరో. హీరో మోటార్స్ కు భారత్ లో మంచి మార్కెట్ ఉంది. ద్విచక్ర వాహనాలకు చాలా డిమాండ్ ఉంటుంది. చాలామంది హీరో కంపెనీకి సంబంధించిన వాహనాలను కొనుగోలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అయితే నవరాత్రులకు ముందే తన కస్టమర్లకు షాకిచ్చింది హీరో మోటార్ కంపెనీ. కంపెనీ టూవీలర్లపై ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది.

పెంచిన ధరలు ఈరోజు నుంచే అమల్లోకి:
మీరు ఈ పండుగ సీజన్‌లో హీరో కంపెనీ బైక్ ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లయితే, దీని కోసంమీ బడ్జెట్‌ను మరో వెయ్యి రూపాయలు అదనంగా ఉంచుకోవాల్సిందే. హీరోస్ స్ప్లెండర్ మనదేశంలో చాలా డిమాండ్ ఉంటుంది. చాలా మంది ఈ బైక్ ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. దీంతోపాటు ప్యాషన్ ప్రో, హీరో గ్లామర్, హీరో మాస్ట్రో స్కూటర్, ఎక్స్‌ట్రీమ్ వంటి బైక్‌లకు కూడా చాలా డిమాండ్ ఉంటుంది. అయితే వీటిని కొనాలంటే ఇప్పుడు అదనంగా డబ్బు చెల్లించాల్సి వస్తుంది.

ధరల పెంపుపై స్టాక్ ఎక్స్ఛేంజ్ సమాచారం
బైక్ ధర పెంపుపై స్టాక్ మార్కెట్‌లోకి కంపెనీ సమాచారం ఇచ్చింది. టూవీలర్ ధరలను పెంచుతున్నట్లు కంపెనీ తెలిపింది. వివిధ మోడళ్ల ప్రకారం ఈ పెంపును రూపాయల వరకు పెంచినట్లు స్పష్టం చేసింది. కాగా గత నెలలో హీరో 4,62,608 యూనిట్లను విక్రయించింది. మరోవైపు, గతేడాది ఇదే సమయంతో పోల్చి చూస్తే, 2021లో మొత్తం 4,53,879 యూనిట్లు అమ్ముడయ్యాయని కంపెనీ ప్రకటించింది. కంపెనీ ఎగుమతుల విషయానికొస్తే, కంపెనీ బైక్‌ల ఎగుమతులు గత నెలలో 11,868 యూనిట్లకు క్షీణించగా, 2021లో కంపెనీ 22,742 యూనిట్లను ఎగుమతి చేసినట్లు కంపెనీ వెల్లడించింది. .

Exit mobile version