Site icon HashtagU Telugu

Robo Taxi : రోబో ట్యాక్సీలు రయ్ రయ్.. వీడియో చూడండి

Robo Taxi

Robo Taxi

Robo Taxi : రోబో ట్యాక్సీలు, డ్రైవర్‌ లేని బస్సులను వినియోగించే ట్రెండ్ క్రమంగా పెరుగుతోంది. వాటిని ప్రయాణికులకు అలవాటు చేసే దిశగా అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నగరంలో అడుగులు పడుతున్నాయి. పైలట్ ప్రాజెక్టులో భాగంగా శాన్‌ఫ్రాన్సిస్కో నగరం పరిధిలోని ట్రెజర్‌ ఐలాండ్‌లో రోబో ట్యాక్సీలు, డ్రైవర్‌ లేని బస్సులను నడుపుతున్నారు.  రోబో ట్యాక్సీలు, డ్రైవర్‌ లేని బస్సులు.. పూర్తిగా ఎలక్ట్రిక్ పరిజ్ఞానంతో పనిచేస్తాయి. అంటే  అవి కరెంటుతో నడుస్తాయి. 2,000 మంది నివసించే ట్రెజర్‌ ఐలాండ్‌లోని నివాస ప్రాంతాలను మార్కెట్‌ ప్రాంతంతో కలిపే రూట్ లో ఫ్రీగా  రోబో ట్యాక్సీలు, డ్రైవర్‌ లేని బస్సులను నడుపుతున్నారు.  ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇవి ఉచితంగా ప్రయాణికులను గమ్య స్థానాలకు చేరుస్తున్నాయి. ఒకేసారి 10 మంది ప్రయాణికులను తీసుకెళ్లే సీటింగ్ కెపాసిటీ ఈ బస్సులు, ట్యాక్సీల సొంతం. వీటిలో డ్రైవర్‌ కానీ..  స్టీరింగ్‌ వీల్‌ కానీ ఉండవు. ఈ బస్సులో రిమోట్‌ కంట్రోల్‌తో ఒక అటెండెంట్‌ మాత్రం ఉంటారు. అత్యవసర పరిస్థితిలో ఆ రిమోట్‌ కంట్రోల్‌తో బస్సును ఆపుతాడు.

Also read : Monsoon Health Tips: మీరు వర్షాకాలంలో కూడా ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ ఇంటి చిట్కాలు పాటించండి..!

గత గురువారం రాత్రి శాన్‌ఫ్రాన్సిస్కో నగరంలో జనరల్‌ మోటార్స్‌ కంపెనీ అనుబంధ సంస్థ “క్రూజ్‌” కు చెందిన  రోబో ట్యాక్సీ (Robo Taxi) ఒక అగ్నిమాపక వాహనాన్ని ఢీకొనడంతో ఒకరికి గాయాలయ్యాయి.  రోబో ట్యాక్సీలు హఠాత్తుగా ఆగుతున్నాయని, రవాణాకు ఆటంకాలు కలిగిస్తున్నాయనే ఆరోపణలు కూడా వచ్చాయి. దీంతో రోబో ట్యాక్సీ లకు ఇప్పుడే పూర్తి  అనుమతులు ఇవ్వకూడదని శాన్‌ఫ్రాన్సిస్కో  అధికారులు నిర్ణయించారు. “క్రూజ్‌” కు చెందిన  రోబో ట్యాక్సీ లలో ఒక్క సహాయక సిబ్బంది కూడా ఉండరు. ఇప్పుడు ట్రెజర్‌ ఐలాండ్‌లో ట్రయల్ ప్రాతిపదిక నడుపుతున్న  రోబో ట్యాక్సీలు, డ్రైవర్‌ లేని బస్సులలో అటెండెంట్‌ కూడా  ఉంటారు కాబట్టి ప్రమాదం జరగదని భావిస్తున్నారు.

Also read : World Mosquito Day: దోమలపై యుద్ధానికి తొలి అడుగు సికింద్రాబాద్ నుంచే.. తెలుసా ?