Site icon HashtagU Telugu

Samsung : గెలాక్సీ ఎఫ్06 5జి విడుదల

Samsung Galaxy F06 5G Release

Samsung Galaxy F06 5G Release

Samsung : సామ్‌సంగ్ భారతదేశంలో అత్యంత సరసమైన 5జి స్మార్ట్‌ఫోన్ అయిన గెలాక్సీ ఎఫ్06 5జి ని ఈరోజు విడుదల చేసినట్లు వెల్లడించింది. అధిక-పనితీరు మరియు శైలి యొక్క పరిపూర్ణ మిశ్రమంతో 5జి విభాగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి గెలాక్సీ ఎఫ్06 5జి సిద్ధంగా ఉంది. గెలాక్సీ ఎఫ్06 5జి సరసమైన ధరకు పూర్తి 5జి అనుభవాన్ని అందిస్తుంది, 5జి సాంకేతికతను ఎక్కువ మంది వినియోగదారులకు అందుబాటులోకి తెస్తుంది. మరియు దేశవ్యాప్తంగా దాని విస్తృత స్వీకరణను వేగవంతం చేస్తుంది. గెలాక్సీ ఎఫ్06 5జి దేశంలో టెలికాం ఆపరేటర్లలో 12 5G బ్యాండ్‌లకు మద్దతు ఇస్తుంది.

Read Also: Komatireddy Venkat Reddy: రీజినల్ రింగ్ రోడ్డు పనులు వేగవంతం

తదుపరి తరం కనెక్టివిటీని అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి రూపొందించబడిన మా అత్యంత సరసమైన 5జి స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయటం పట్ల మేము చాలా సంతోషంగా వున్నాము. డిజిటల్ అంతరాన్ని పూరించటం మరియు సమగ్ర 5జి అనుభవంతో లక్షలాది మంది వినియోగదారులకు సాధికారత అందించటం, అత్యుత్తమ పనితీరు మరియు సరికొత్త స్టైలిష్ డిజైన్‌తో లక్షలాది మంది వినియోగదారులను శక్తివంతం చేయడంలో మా నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. గెలాక్సీ ఎఫ్06 5జి ను కేవలం రూ. 9499 ప్రారంభ ధరకు విడుదల చేసాము. గెలాక్సీ ఎఫ్06 5జి తో, మేము కేవలం స్మార్ట్‌ఫోన్‌ను మాత్రమే విడుదల చేయటం కాకుండా, ప్రతి భారతీయుడికి కొత్త అవకాశాలను కూడా అందిస్తున్నాము  అని సామ్‌సంగ్ ఇండియా ఎంఎక్స్ బిజినెస్ జనరల్ మేనేజర్ అక్షయ్ ఎస్ రావు అన్నారు.

టెలికాం ఆపరేటర్లు అందరి వద్ద 12 5జి బ్యాండ్‌లకు మద్దతు ఇచ్చే గెలాక్సీ ఎఫ్06 5జి సాటిలేని కనెక్టివిటీని అందించడానికి నిర్మించబడింది. ఇది వేగవంతమైన డౌన్‌లోడ్ మరియు అప్‌లోడ్ వేగాన్ని అందించడానికి క్యారియర్ అగ్రిగేషన్‌తో వస్తుంది. గెలాక్సీ ఎఫ్06 5జి మృదువైన ప్రత్యక్ష ప్రసార మరియు వీడియో కాలింగ్ అనుభవాన్ని అందించడానికి కూడా విడుదల చేయబడింది. గెలాక్సీ ఎఫ్06 5జి ‘రిపుల్ గ్లో’ ఫినిష్ ను కలిగి ఉంది, ఇది ప్రతి కదలికతో చక్కదనం మరియు అధునాతనతను వెలిగిస్తుంది. 800 Nits బ్రైట్‌నెస్‌తో 6.7” పెద్ద HD+ డిస్‌ప్లేను కలిగి ఉన్న గెలాక్సీ ఎఫ్06 5జి వినియోగదారులకు అద్భుతమైన విజువల్స్ మరియు మెరుగైన వీక్షణ అనుభవాన్ని అందిస్తుంది.

Read Also: KCR : 19న బీఆర్‌ఎస్‌ విస్తృతస్థాయి సమావేశం