Site icon HashtagU Telugu

Samsung : ఏఐ – ఆధారిత టీవీలపై అద్భుతమైన ఆఫర్‌లు మరియు డీల్‌లను ప్రకటించిన సామ్‌సంగ్

Samsung announces amazing offers and deals on AI-powered TVs

Samsung announces amazing offers and deals on AI-powered TVs

Samsung : భారతదేశంలో అతిపెద్ద కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన సామ్‌సంగ్ , గుడి పడ్వా మరియు ఉగాదిని వేడుక జరుపుకోవడానికి తమ ప్రత్యేకమైన ఫెస్టివ్ క్యాంపెయిన్‌ను ప్రీమియం ఏఐ పెద్ద స్క్రీన్ టీవీలపై ప్రారంభించింది, ఈ టీవీలలో నియో QLED 8K, నియో QLED 4K, OLED మరియు క్రిస్టల్ 4K UHD టీవీ మోడళ్లు ఉన్నాయి. మార్చి 5 నుండి మార్చి 31, 2025 వరకు జరిగే ఈ ప్రచారం వినియోగదారులకు వారి గృహ వినోద అనుభవాన్ని ఆధునీకరించటానికి సాటిలేని ఆఫర్‌లను అందిస్తుంది.

Read Also: KTR : వచ్చే ఏడాది నుంచి పాదయాత్ర చేస్తా: కేటీఆర్‌

గృహ వినోదాన్ని తదుపరి స్థాయికి తీసుకువెళ్తూ , సామ్‌సంగ్ యొక్క ప్రీమియం శ్రేణి టీవీలు ఏఐ -ఆధారిత చిత్ర నాణ్యత, లీనమయ్యే ధ్వని మరియు సొగసైన డిజైన్‌లను అందిస్తాయి. వినియోగదారులు ఎంపిక చేసిన కొనుగోళ్లపై రూ. 2,04,990 వరకు విలువైన ఉచిత టీవీని లేదా రూ. 90,990 వరకు విలువైన ఉచిత సౌండ్‌బార్‌ను కూడా పొందవచ్చు. ఈ ఆవిష్కరణలను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి, సామ్‌సంగ్ 20% వరకు క్యాష్‌బ్యాక్, జీరో డౌన్ పేమెంట్ మరియు 30 నెలల వరకు కేవలం రూ. 2990 నుండి ప్రారంభమయ్యే సులభమైన ఈఎంఐ అవకాశాలను అందిస్తోంది. అదనంగా, వారు ఏదైనా సామ్‌సంగ్ టీవీ కొనుగోలుతో సామ్‌సంగ్ సౌండ్‌బార్‌లపై 45% వరకు తగ్గింపును పొందవచ్చు, ఇది సినిమాటిక్ వీక్షణ అనుభవానికి అప్‌గ్రేడ్ చేయడానికి సరైన అవకాశంగా మారుతుంది. ఈ ఆఫర్‌లు Samsung.com, ప్రముఖ ఆన్‌లైన్ పోర్టల్‌లు మరియు భారతదేశం అంతటా ఎంపిక చేసిన సామ్‌సంగ్ రిటైల్ అవుట్‌లెట్‌లలో అందుబాటులో ఉంటాయి.

“సామ్‌సంగ్ వద్ద, మేము అత్యాధునిక సాంకేతికతను ఆకర్షణీయమైన డీల్‌లతో కలిపి అందించడం ద్వారా, అత్యుత్తమ సాంకేతికతను వారి ఇళ్లలోకి తీసుకు వచ్చి వినియోగదారుల వీక్షణ అనుభవాన్ని మెరుగుపరచడానికి నిరంతరం కృషి చేస్తుంటాము. మా ప్రీమియం ఏఐ -శక్తితో కూడిన టీవీలు వినోదాన్ని పునర్నిర్వచించాయి. అసమానమైన చిత్ర నాణ్యత, లీనమయ్యే శబ్దం మరియు సజావుగా కనెక్టివిటీని అందిస్తున్నాయి. మేము ఆసమ్ ఇండియాతో పండుగల మాసాన్ని జరుపుకుంటున్నప్పుడు. సామ్‌సంగ్ యొక్క ఏఐ -శక్తితో కూడిన టీవీల శ్రేణిపై ప్రత్యేకమైన డీల్‌లను అందించడానికి మేము సంతోషిస్తున్నాము. ఈ ఉత్తేజకరమైన పండుగ ఆఫర్‌ల ద్వారా, వినియోగదారులు తమ వీక్షణ అనుభవాన్ని మెరుగుపరచుకోవడానికి, తమ ప్రియమైనవారితో సాధ్యమైనంత లీనమయ్యే విధంగా వేడుక జరుపుకోవడానికి వీలు కల్పించడం ద్వారా ప్రీమియం హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను మరింత అందుబాటులోకి తీసుకురావాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము,” అని సామ్‌సంగ్ ఇండియా విజువల్ డిస్‌ప్లే బిజినెస్ సీనియర్ డైరెక్టర్ విప్లవేష్ డాంగ్ అన్నారు.

మార్చి నెల మొత్తం అందుబాటులో ఉన్న సామ్‌సంగ్ యొక్క తాజా పండుగ ఆఫర్‌లు, ఏఐ -శక్తితో కూడిన గృహ వినోదం ను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి రూపొందించబడ్డాయి. ప్రీమియం టీవీ శ్రేణి వినియోగదారులు అధునాతన ఏఐ అప్‌స్కేలింగ్, జీవితపు తరహా కలర్ ఖచ్చితత్వం మరియు ఉన్నతమైన ధ్వని నాణ్యతతో లీనమయ్యే విజువల్స్‌ను ఆస్వాదించేలా చేస్తుంది. డాల్బీ అట్మాస్ మరియు క్యు సింఫనీ తో కూడిన సామ్‌సంగ్ టీవీ లు, మల్టి డైమెన్షనల్ ఆడియోను అందిస్తాయి, ప్రతి సన్నివేశాన్ని మరింత ఆకర్షణీయంగా చేస్తాయి. అంతేకాకుండా, సామ్‌సంగ్ నాక్స్ భద్రతతో, వినియోగదారులు సురక్షితమైన , సౌకర్యవంతమైన స్మార్ట్ టీవీ అనుభవాన్ని ఆస్వాదించవచ్చు. ఏఐ మరియు క్వాంటం మ్యాట్రిక్స్ టెక్నాలజీ శక్తి వంతమైన ఈ టీవీలు అత్యుత్తమ కాంట్రాస్ట్, స్పష్టత మరియు ప్రకాశాన్ని అందిస్తాయి, ఏ లివింగ్ రూమ్‌ను అయినా హోమ్ థియేటర్‌గా మారుస్తాయి.

సామ్‌సంగ్ యొక్క పండుగ ప్రచారం సాంకేతికత, డిజైన్ , విలువల యొక్క పరిపూర్ణ సమ్మేళనాన్ని అందిస్తూ, ఆవిష్కరణ , వినియోగదారుల ఆనందం పట్ల దాని నిబద్ధతను నొక్కి చెబుతుంది. ఈ ఆఫర్లు నియో QLED 8K, నియో QLED 4K, OLED TV మరియు క్రిస్టల్ 4K UHD TV శ్రేణిలోని 55” మరియు అంతకంటే ఎక్కువ సైజుల టీవీలపై అందుబాటులో ఉన్నాయి.

Read Also: Constable posts : త్వరలో 10,762 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ : హోం మంత్రి అనిత