Site icon HashtagU Telugu

E2GO రూ. 60 వేల ఎలక్ట్రిక్ స్కూటర్. రూ. 2 వేలకే సొంతం చేసుకోవచ్చు.

Rs. 60 Thousand Electric Scooter. Rs. 2 Thousand Can Be Owned. E2go

Rs. 60 Thousand Electric Scooter. Rs. 2 Thousand Can Be Owned. E2go

పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోయిన ఈ రోజుల్లో.. అందరూ ఎలక్ట్రిక్ స్కూటర్లు కొంటున్నారు. ఈ క్రమంలో Odysse కంపెనీ రూపొందించిన E2go ఎలక్ట్రిక్ స్కూటర్‌ మైలేజ్ బాగుంది. ఒక కిలోమీటర్‌కి 28 పైసలు మాత్రమే ఖర్చవుతుందని కంపెనీ తెలిపింది. ఈ స్కూటర్‌కి రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ అక్కర్లేదు. ఈ స్కూటర్ ఫీచర్స్ తెలుసుకుందాం.

స్కూటర్ ఫీచర్స్:

కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం ఇందులో 2 వేరియంట్లు ఉన్నాయి. అంటే.. స్కూటర్లు సేమ్.. బ్యాటరీలు మాత్రం వేరు. E2go Lead Acid ఎక్స్‌షోరూమ్ ధర రూ.59,750 కాగా E2go Lite – Lithium-ion ఎక్స్‌షోరూమ్ ధర రూ.71,100గా ఉంది. ఈ E2Go Lead Acid స్కూటర్ 60 కిలోమీటర్ల రేంజ్ కలిగివుంది. ఇది గంటకు అత్యధికంగా 25 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. బ్యాటరీని ఛార్జ్ చేసేందుకు 5 గంటలు పడుతుంది. దీని బరువు 90 కేజీలు. దీనికి USB చార్జింగ్ పాయింట్ కూడా ఉంది. E2Go Lite – Lithium-ion స్కూటర్ 70 కిలోమీటర్ల రేంజ్ కలిగివుంది. ఇది గంటకు అత్యధికంగా 25 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. బ్యాటరీని ఛార్జ్ చేసేందుకు 4 గంటలు పడుతుంది. దీని బరువు 90 కేజీలు. దీనికి కూడా USB చార్జింగ్ పాయింట్ కూడా ఉంది.