Royal Enfield Shotgun 650 : మార్కెట్లోకి విడుదలైన రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650.. ధర, ఫీచర్స్ ఇవే?

రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 బుల్లెట్ ప్రపంచ మార్కెట్‌లో రిలీజ్ అయ్యింది. యూక

  • Written By:
  • Publish Date - January 17, 2024 / 03:30 PM IST

రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 బుల్లెట్ ప్రపంచ మార్కెట్‌లో రిలీజ్ అయ్యింది. యూకే, యూరోపియన్ మార్కెట్‌లలో లాంచ్న షాట్‌గన్ 650 ఫిబ్రవరి 2024 నుంచి అందుబాటులోకి రానుంది. మోటార్‌సైకిల్ యూకేలో 6,699 పౌండ్‌లు, యూరప్ అంతటా 7,590 యూరోల వద్ద ప్రారంభమవుతుంది. అయితే భారత మార్కెట్లో బుకింగ్‌లు ప్రారంభం కాగా, షాట్‌గన్ 650 మార్చి 2024 నుంచి భారత్‌లో టెస్ట్ రైడ్‌లు, డెలివరీలకు అందుబాటులో ఉంటుంది. దేశంలో ఈ బైకు ధర రూ. 3,59,430 నుంచి ప్రారంభం కానుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్ 2024 వసంతకాలం నుంచి అమెరికా, ఆసియా-పసిఫిక్ లోకి ప్రవేశిస్తుంది.

షాట్‌గన్ 650 ఎస్‌జీ650 కాన్సెప్ట్ నుంచి ప్రేరణ పొందింది. ఈఐసీఎంఏ 2021లో ప్రదర్శించింది. ఈ మోటార్‌సైకిల్ గోవాలో మోటోవెర్స్ 2023లో ఆవిష్కరించింది. డిసెంబర్ 2023లో ప్రపంచ మార్కెట్లోకి వచ్చింది. 650 ట్విన్ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా షాట్‌గన్ 650 648సీసీ, 4-స్ట్రోక్, ఎస్ఓ‌హెచ్‌సీ, ఎయిర్-ఆయిల్ కూల్డ్, ఈఎఫ్ఐ ఇంజిన్‌ను ఉపయోగిస్తుంది. 46.4హెచ్‌పీ గరిష్ట శక్తిని 52.3ఎన్ఎమ్ పీక్ ట్విస్టింగ్ ఫోర్స్‌ను అభివృద్ధి చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. షాట్‌గన్ 650 మైలేజ్ 22కెఎంపీఎల్. కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 స్టీల్ ట్యూబులర్ స్పైన్ ఫ్రేమ్‌ను ఉపయోగిస్తుంది. ముందు భాగంలో యూఎస్‌డీ ఫోర్క్స్, బ్యాక్ సైడ్ ట్విన్ షాక్‌లను కలిగి ఉంది. ముందు భాగంలో 18-అంగుళాల అల్లాయ్ వీల్ ఉంది. వెనుకవైపు 17-అంగుళాల అల్లాయ్ వీల్ ఉంది. రెండూ ట్యూబ్‌లెస్ టైర్లతో ఉంటాయి.

ముందు వెనుక ఒక్కొక్కటి డిస్క్‌ను కలిగి ఉంది. రెండూ ట్విన్ పిస్టన్ ఫ్లోటింగ్ కాలిపర్‌ను కలిగి ఉంటాయి. కాగా ఈ మోటార్‌సైకిల్‌కు డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ కూడా ఉంది. కొత్త షాట్‌గన్ 650 స్టెన్సిల్ వైట్, ప్లాస్మా బ్లూ, గ్రీన్ డ్రిల్, షీట్ మెటల్ గ్రే అనే 4 కలర్ ఆప్షన్లను కలిగి ఉంటుంది. ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ట్రిప్పర్ నావిగేషన్ సిస్టమ్‌తో కూడిన డిజి-అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్‌ను పొందుతుంది. సింగిల్ ఫ్లోటింగ్ సీటు మోటార్‌సైకిల్‌కు చాలా ప్రత్యేకమైన రూపాన్ని ఇస్తుంది. మోటార్‌సైకిల్ కొత్తగా లాంచ్ అయిన రాయల్ ఎన్‌ఫీల్డ్ వింగ్‌మ్యాన్‌తో వస్తుంది. మోటార్‌సైకిల్ లైవ్ లొకేషన్, ఇంధనం, ఇంజిన్ ఆయిల్ స్థాయిలు, సర్వీస్ రిమైండర్‌లు మొదలైన వాటిపై అప్‌డేట్ చేసే కొత్త ఇన్-యాప్ ఫీచర్ కూడా ఉంటుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 కోసం 31 జెన్యూన్ మోటార్‌సైకిల్ అప్లియన్సెస్ అందజేస్తుంది. వీటిలో బార్ ఎండ్ మిర్రర్స్, స్కల్ప్టెడ్ సోలో సీట్, కాంట్రాస్ట్-కట్ బిల్లెట్ రిమ్‌లు ఉన్నాయి. వేరియంట్ వారీగా రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 ధరలు ఇలా ఉన్నాయి.