Site icon HashtagU Telugu

Royal Enfield : త్వరలో మార్కెట్లోకి రాయల్ ఎన్ ఫీల్డ్ స్క్రాంబ్లర్ 650…ఫీచర్స్ చూస్తే షాకే..!!

Royal Enfiled

Royal Enfiled

రాయల్ ఎన్ ఫీల్డ్…పేరులోనే రాయల్ ఉన్నట్లుగా బైక్ కూడా చాలా రాయల్ లుక్ లో కనిపిస్తుంది. గతకొన్నేళ్లుగా ఈ రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ భారత్ మార్కెట్ ను శాసిస్తోంది. ముఖ్యంగా యువతలో రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ అంటే ఎంతో క్రేజ్ ఉంటుంది. వారి టెస్టుకు తగ్గట్లుగా కొత్త కొత్త మోడల్స్ ను భారత్ మార్కెట్లోకి ప్రవేశపెడుతోంది. తాజాగా కంపెనీ త్వరలో రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రాంబ్లర్ 650ని భారతీయ మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. లాంచ్‌కు ముందే, ఈ బైక్‌కి సంబంధించిన కొన్ని ఫీచర్స్ లీక్ అయ్యాయి అవేంటో చూద్దాం.

ఆకట్టుకునే డిజైన్…అదిరిపోయే లుక్:
ఈ రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ భారత మార్కెట్లో చాలా సార్లు టెస్టు చేశారు.దీంతో కంపెనీ ఏకకాలంలో చాలా బైక్ లను తయారు చేస్తోంది. ఇక కంపెనీ నుంచి రానున్న రోజుల్లో 650సీసీ స్క్రాంబర్ల మోడల్ తో సహా అనేక ఇతర 650సీసీ బైక్ లను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. భారత్ లో త్వరలో రిలీజ్ కానున్న స్క్రాంబ్లర్ 650 యొక్క ప్రొడక్షన్-రెడీ టెస్ట్ బైక్ పరీక్ష గురించి గోప్యంగా ఉంచింది కంపెనీ. కానీ లీక్ అయిన సమాచారం ప్రకారం అదిరిపోయే డిజైన్ తోపాటు యూత్ ను మరింతగా ఆకట్టుకునే లుక్ లో ఈ బైక్ ఉండనుంది.

డిజైన్
ఇది సింగిల్-పీస్ శాడిల్, వైర్-స్పోక్ వీల్స్, సింగిల్ అప్‌స్వెప్ట్ ఎగ్జాస్ట్, రౌండ్ లైట్లు, టియర్-డ్రాప్స్‌తో కూడిన రెట్రో థీమ్‌తో రానుంది. . బైక్ స్టైలింగ్ గురించి మాత్రం కంపెనీ ఇంకా లీక్ చేయలేదు.

ఇంజన్
ఇంజన్ గురించి మాట్లాడితే, RE 650cc బైక్ లాగా, స్క్రాంబ్లర్ 650 కూడా ఇంటర్‌సెప్టర్ , కాంటినెంటల్ 650 GT వంటి ఇతర RE బైక్‌లతో అందించబడే అదే 648cc సమాంతర-ట్విన్ మోటారును కలిగి ఉంటుంది.

ఫీచర్లు
ఇది కాకుండా, డ్యూయల్-డిస్క్ బ్రేక్ సెటప్ కూడా ఉంటుంది. ఇది డ్యూయల్ ఛానల్ ABS స్టాండర్డ్‌గా వస్తుంది. సస్పెన్షన్ సెటప్ ముందు భాగంలో USD ఫోర్కులు, వెనుకవైపు డ్యూయల్-షాక్ అబ్జార్బర్‌లను ఉంటాయి. , ఇది మొబైల్ కనెక్టివిటీ, ఎలక్ట్రిక్ స్టార్ట్, ట్విన్-పాడ్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌తో రానుంది.