Royal Enfield: త్వరలో మార్కెట్ లోకి విడుదల కానున్న రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ మోటార్‌ సైకిల్స్ ఇవే?

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌.. ఈ బైక్స్ కి మార్కెట్లో ఉన్న క్రేజ్ డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలామంది వీటిని కొనుగోలు చేయాలని అనుకుం

  • Written By:
  • Publish Date - December 19, 2023 / 05:28 PM IST

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌.. ఈ బైక్స్ కి మార్కెట్లో ఉన్న క్రేజ్ డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలామంది వీటిని కొనుగోలు చేయాలని అనుకుంటూ ఉంటారు. కానీ వాటి ధర కారణంగా చాలామంది వెనుకడుగు వేస్తూ ఉంటారు. అయితే ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్ లు విడుదలైన విషయం మనందరికీ తెలిసిందే. వాటితో పాటు ఎప్పటికప్పుడు కొత్త కొత్త బైక్లు మార్కెట్లోకి విడుదల అవుతూనే ఉన్నాయి. ఇది ఇలా ఉంటే త్వరలో అనగా 2024 సంవత్సరంలో ఒకటి రెండు కాదు ఏకంగా నాలుగు సరికొత్త రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ సైకిల్స్ ని మార్కెట్లోకి విడుదల చేస్తోంది. ఆ జాబితాలో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ షాట్‌గన్‌ 650 సహా మరో మూడు బైక్‌లు ఉన్నాయి. అయితే ఈ మూడు బైక్‌లు ఎటువంటి స్పెసిఫికేషన్లను కలిగి ఉంటాయి. మరి ఆ బైకుల ధర ఫీచర్ల విషయానికి వస్తే..

రాయల్ ఎన్‌ఫీల్డ్‌ షాట్‌గన్‌ 650.. Motoverse 2023 వద్ద రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ షాట్‌గన్‌ 650 మోటార్‌ సైకిల్‌ విడుదల అయింది. ఈ బైక్‌ అధికారిక విడుదల కార్యక్రమం జనవరిలో ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ షాట్‌గన్‌ 650 ధర Meteor 650 కంటే తక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. కాగా ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్‌ షాట్‌గన్‌ 650 బైక్‌ 18 అంగుళాల ఫ్రంట్‌ వీల్స్‌, 17 అంగుళాల వెనుక వీల్స్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. కొంచెం భిన్నమైన హ్యాండిల్‌ బార్‌ మరియు పుట్‌రెస్ట్ ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. సీటింగ్‌ కూడా భిన్నమైన డిజైన్‌తో వస్తుందని తెలుస్తోంది.

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ హంటర్‌ 450..రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ తన 450సీసీ సెగ్మెంట్‌ వాహనాల శ్రేణిని విస్తరించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇందుకోసం 2024 సంవత్సరంలో హంటర్‌ 450 మోటార్ సైకిల్‌ను లాంచ్‌ చేయనుంది. ట్రయంఫ్‌ స్పీడ్ 400కు పోటీనిచ్చే అవకాశం ఉంది. హంటర్‌ బైక్‌ 452సీసీ సింగిల్‌ సిలిండర్‌ లిక్విడ్‌ కూల్డ్‌ DOHC 4- వాల్వ్‌ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్‌ 40.02ps శక్తి, 40Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్ బాబర్ 350… ఈ బైక్‌ ఆధారంగా రాయల్‌ ఎన్‌ఫీల్డ్ బాబర్‌ మోటార్‌ సైకిల్‌ను అభివృద్ధి చేసేందుకు ప్లాన్‌ చేస్తోంది. ఈ బైక్ కీలక ఫీచర్లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. వైట్ వాల్‌ టైర్లు, ఎత్తైన హ్యాండిల్‌బార్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. అవసరానికి అనుగుణంగా అమర్చుకొనే వెనుక సీటును కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్‌ 349cc సింగిల్ సిలిండర్‌ ఎయిర్ మరియు ఆయిల్‌ కూల్డ్‌ SOHC ఇంజిన్‌ను కలిగి ఉంటుంది.

రాయల్‌ ఎన్‌ఫీల్ట్ స్క్రాంబ్లర్‌ 650.. భారత్‌లోని వివిధ ప్రాంతాల్లో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ తన స్ర్కాంబర్లర్ 650 మోటార్‌ సైకిల్ టెస్టింగ్‌ చేయడాన్ని చూడవచ్చు. భారత్‌ సహా విదేశాల్లోనూ ఈ బైక్‌ను టెస్టింగ్ చేస్తున్నారు. ఈ మోటార్‌ సైకిల్‌ కీలక ఫీచర్లను కలిగి ఉంది. మెరుగైన గ్రౌండ్‌ క్లియరెన్స్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 648సీసీ పేర్లల్‌ ట్విన్‌ సిలిండర్‌ ఇంజిన్‌తో వస్తుంది.