Royal Enfield : రాయల్ ఎన్‌ఫీల్డ్.. మన దేశంలోని యూత్‌కు ఎంతో ఇష్టమైన బైక్ బ్రాండ్. దీని నుంచి మరో కొత్త బైక్ అతి త్వరలో విడుదల కానుంది. ఆ మోడల్ పేరు.. ‘‘రాయల్ ఎన్‌ఫీల్డ్ బేర్ 650’’. ఈ బైక్‌ను ఇటలీలోని మిలాన్ వేదికగా నవంబరు 5న జరగనున్న ‘EICMA 2024’ ఆటో షోలో రిలీజ్ చేయనున్నారు. ఈ బైక్ ధర దాదాపు రూ.3.50 లక్షలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. దీనిలో ఉండబోయే ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి..
Also Read :Tihar Jail Warden : నోయిడా కేంద్రంగా తిహార్ జైలు వార్డెన్ డ్రగ్స్ దందా
- ‘‘రాయల్ ఎన్‌ఫీల్డ్ బేర్ 650’’ బైక్ 650 సీసీ, ప్యార్లల్ ట్విన్ ఇంజిన్‌తో వస్తుంది. దీని ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.
- ఇది టూ-ఇన్-టు ఎగ్జాస్ట్ సిస్టమ్‌తో వస్తుంది. అందువల్ల మొత్తం బరువు కొద్దిగా తగ్గుతుంది.
- ఇందులో ఎల్‌ఈడీ లైట్లు, వీల్ సైజ్ చూడటానికి భిన్నంగా ఉంటాయి.
- ఈ బైక్‌లో(Royal Enfield) స్పోక్ వీల్స్, ఎంఆర్ఎఫ్ కంపెనీకి చెందిన ‘నైలోరెక్స్’ ఆఫ్ రోడ్ టైర్లు ఉంటాయి.
- ఇది షోవా యూఎస్‌డీ ఫోర్క్‌లతో వస్తుంది.
- ఈ బైక్ ఇంటర్నల్ పార్ట్స్ భిన్నంగా ఉంటాయి.
- రాయల్ ఎన్‌ఫీల్డ్ ట్రావెల్ ఇంటర్‌సెప్టర్ బైక్ కంటే ఈ బైకులో సీటు ఎత్తు ఎక్కువే ఉంటుంది.
- అచ్చం రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ మాదిరిగానే ఈ బైక్ బ్రేక్స్ ఉంటాయి. ఫ్రంట్ బ్రేక్ డిస్క్ సైజు పెద్దగా ఉంటుంది.
- ఈ బైకులో డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ స్టాండర్డ్‌గా ఉంటుంది.
- స్క్రాంబ్లర్ ఇన్‌బిల్డ్ నావిగేషన్ సిస్టమ్‌తో ఫుల్ కలర్ టీఎఫ్‌టీ స్క్రీన్‌ను ఈ బైక్ కలిగి ఉంది.
- ఐదు కలర్లలో ఈ బైక్ లభించనుంది.
Also Read :Clash In Court : కోర్టులో లాయర్లపై పోలీసుల లాఠీఛార్జి.. వీడియో వైరల్
‘ఇంటర్‌సెప్టర్ బేర్ 650’ కీలక ఫీచర్లు |
|
---|---|
ఇంజిన్ కెపాసిటీ | 648 సీసీ |
ట్రాన్స్‌మిషన్ | 6 స్పీడ్ మ్యానువల్ |
బైక్ బరువు | 216 కేజీ |
ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ | 13.7 లీటర్లు |
మ్యాక్స్ పవర్ | 46.8 బీహెచ్‌పీ |