Site icon HashtagU Telugu

Royal Enfield Guerrilla 450: మార్కెట్ లోకి కొత్త ఎన్ఫీల్డ్ బైక్.. లాంచింగ్ అయ్యేది అప్పుడే!

Mixcollage 29 Jun 2024 07 20 Pm 1580

Mixcollage 29 Jun 2024 07 20 Pm 1580

ద్విచక్ర వాహన వినియోగదారులు ఎక్కువ శాతం మంది ఇష్టపడే బైక్స్ లో రాయల్ ఎన్‌ఫీల్డ్‌ బైక్ లు కూడా ఒకటి. చాలామంది వీటిని కొనాలని ఆశగా ఉన్నప్పటికీ కానీ వాటి ధరల కారణంగా చాలామంది వెనుకడుగు వేస్తూ ఉంటారు. అందుకే చాలామంది వాటిని కొనలేక అందుబాటులో సరసమైన ధరలో ఉండే బైక్లను కొనుక్కొని అడ్జస్ట్ అవుతూ ఉంటారు. కానీ ఇటీవల కాలంలో ఎన్ఫీల్డ్ బైకులు అందరికీ అందుబాటులో సరసమైన ధరలకే మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. ఇప్పటికే చాలా రకాల బైకులు మార్కెట్లోకి విడుదలైన విషయం తెలిసిందే. త్వరలోనే మరొక బైక్ కూడా మార్కెట్లోకి విడుదల కానుంది.

ఈ మేరకు తాజాగా ఒక టీజర్ ని కూడా విడుదల చేసింది. రాయల్ ఎన్​ఫీల్డ్​ గొరిల్లా 450 మొదటి టీజర్​ను సైతం తాజాగా విడుదల చేసింది. అంతేకాదు ఈ బైక్​ లాంచ్​పై ఒక అప్డేట్​ ఇచ్చారు సంస్థ​ మేనేజింగ్ డైరెక్టర్ సిద్ధార్థ్​ లాల్. 2024 జూలై 17న గొరిల్లా 450 గ్లోబల్ లాంచ్​ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. మరి త్వరలోనే విడుదల కానున్న ఈ బైక్ కు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. రాయల్ ఎన్​ఫీల్డ్​ గొరిల్లా 450 కొత్త హిమాలయన్ ప్లాట్​ఫామ్ ఆధారంగా రూపొందుతున్న రెండో బైక్​. ఇందులో కొత్తగా అభివృద్ధి చేసిన షెర్పా 450 ఇంజిన్​ ఉండనుంది. ఎల్ఈడీ హెడ్​ల్యాంప్, ఎల్ఈడీ ఇండికేటర్లను హిమాలయన్ నుంచి తీసుకురాగా, ఈ మోడల్లో యూఎస్డీలకు బదులుగా ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్కులను సంస్థ అమర్చింది.

అలాగే వెనుక భాగంలో ప్రీలోడ్ మోనోషాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటుందని భావిస్తున్నారు. కొత్త మోడల్​ లో రౌండ్ డిజిటల్ ఇన్​స్ట్రుమంమెంట్ కన్సోల్ కూడా ఉంది. నావిగేషన్​ సహా అన్ని కనెక్టివిటీ ఆప్షన్స్​ వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే రాయల్ ఎన్​ఫీల్డ్ గొరిల్లా 450 స్పెసిఫికేషన్ ల విషయానికి వస్తే.. గొరిల్లా 450 బైక్​లో ఫ్లాట్ హ్యాండిల్ బార్, రోడ్​ బయాస్డ్​ టైర్లతో అల్లాయ్ వీల్స్, డిఫరెంట్ రైడింగ్ ట్రయాంగిల్ ఉన్నాయి. ఈ కొత్త బైక్ ఆర్ఈ హిమాలయన్ 450 కంటే గణనీయంగా తేలికైనది. అయితే దీని బరువు ఎంతవరకు ఉంటుందో అనేది మాత్రం ఇంకా తెలియదు. ఇందులోని 452సీసీ సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. హిమాలయన్​ బైక్​లో ఈ ఇంజిన్ సుమారుగా 39బిహెచ్​పీ పవర్, 40ఎన్ఎమ్ టార్క్​ని ప్రొడ్యూస్ చేస్తుంది.

గొరిల్లా 450లో కూడా ఇవే ఫిగర్స్​ ఉండొచ్చు. 6-స్పీడ్ గేర్ బాక్స్​ని మార్చే అవకాశం ఉంది. అయితే ఈ బైక్ గ్లోబల్ అరంగేట్రానికి ముందు మరిన్ని టీజర్లను ఆర్ఈ పంచుకునే అవకాశం ఉంది. ఇక ఇండియా లాంచ్​ కోసం కొంత కాలం ఆగల్సిందే అని తెలుస్తోంది! పండుగ సీజన్ సమయంలో ఈ రాయల్​ ఎన్​ఫీల్డ్​ గొరిల్లా 450 ఇండియాలో లాంచ్​ అవ్వొచ్చు. కొత్త గొరిల్లా 450 బైక్​ ధర రూ .2.6 లక్షలకు పైగా ఉంటుందని అంచనా.

Exit mobile version