ప్రముఖ మోటార్ సైకిల్ తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇప్పటికే మార్కెట్లోకి చాలా రకాల ఎన్‌ఫీల్డ్ బైకులను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేసిన వాటితో పాటు వినియోగదారులను మరింత ఆకర్షించడం కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోటార్ సైకిల్ లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది ఎన్ ఫీల్డ్. అందులో భాగంగానే తాజాగా మార్కెట్ లోకి గెరిల్లా 450 బైక్ ను విడుదల చేసింది. తాజాగా స్పెయిన్ లోని బార్సిలోనా లో జరిగిన కార్యక్రమంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 బైక్ ను లాంచ్ చేసింది. ఈ బైక్ అనలాగ్, డాష్, ఫ్లాష్ అనే మూడు వేరియంట్ లలో లభించునుంది.
ఇకపోతే ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 ధర విషయానికి వస్తే.. రూ. 2.54 లక్షలు, ఇండియాలో రూ. 2.39 లక్షల నుండి ప్రారంభం అవుతుంది. ఇంత చౌక ధరలో 450 సీసీ బైక్‌ను విడుదల చేయడం అన్నది ఇదే మొదటిసారి. ఇకపోతే తాజాగా విడుదల చేసిన ఈ బైక్ ఫీచర్ల విషయానికొస్తే.. గెరిల్లా 450 బైక్ బుకింగ్స్ కంపెనీ ప్రారంభించింది. ఆగస్టు 1 నుంచి కస్టమర్ లకు రైడింగ్ ఎక్స్ పీరియన్స్ ప్రారంభం కానుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 ఆధునిక రెట్రో డిజైన్‌తో ఉంది. నేక్డ్ బైక్ లో రౌండ్ హెడ్ లైట్, వృత్తాకార ఇన్‌స్ట్రుమెంట్ డిస్‌ప్లే ఉన్నాయి. ఇది మొదట హిమాలయన్ 450లో కనిపించింది. టియర్ డ్రాప్ ఆకారపు ఫ్యూయెల్ ట్యాంక్, పొడవాటి సింగిల్ సీటు, వెనుక వైపు చిన్న LED టెయిల్ లైట్ ఉన్నాయి.
హిమాలయన్ 450 లో స్ప్లిట్ సీట్ ఉంది. అంటే రెండు సీట్లో తేడా ఉంది. గెరిల్లా 450 బైక్ అనలాగ్ వేరియంట్ రెండు రంగు ఎంపికలలో అందిస్తారు. స్మోక్, ప్లేయా బ్లాక్. ఈ ప్లేయా బ్లాక్ కలర్ డాష్ వేరియంట్ లో కూడా అందించబడుతుంది. ఇది గోల్డ్ డిప్ కలర్ లో వస్తుంది. అలాగే ఈ ఫ్లాష్ వేరియంట్ బ్రావా బ్లూ, ఎల్లో రిబ్బన్ వంటి రెండు కలర్ ఆప్షన్ లలో కూడా లభించనుంది. కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 బైక్‌లో షెర్పా 452 సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 8,000 RPM వద్ద 39.50 Bhp శక్తిని, 5,500 RPM వద్ద 40 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. గెరిల్లా 450 బైక్‌లో స్టీల్ ట్యూబ్యులర్ ఫ్రేమ్ ఉంది, ఇది ఇంజిన్ ప్రెజర్‌ను బాగా హ్యాండిల్ చేస్తుంది.
హిమాలయన్ 450 బైక్ తో పోలిస్తే గెరిల్లా 450 బైక్ భిన్నమైన వెనుక సబ్ ఫ్రేమ్ ని కలిగి ఉంటుంది. ఈ బైక్ ముందు భాగంలో, గెరిల్లా 450 43 మిమీ టెలిస్కోపిక్ ఫోర్క్ ను కూడా కలిగి ఉంటుంది. వెనుక భాగంలో ప్రీలోడ్ అడ్జస్టబుల్ మోనోషాక్ ఉంటుంది. ముందువైపు 310 మిమీ డిస్క్ బ్రేక్, వెనుక వైపు 270 మిమీ డిస్క్ బ్రేక్ ను కూడా అమర్చారు. గెరిల్లా 450 బైక్‌లో సీట్ గ్రిప్ XL ట్యూబ్‌లెస్ టైర్లతో 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. కొత్త గెరిల్లా 450 బరువు 185 కిలోలు, ఇది హిమాలయన్ 450 కంటే 11 కిలోలు తేలికైనది. ఇది 169 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్‌ను కూడా అందిస్తుంది.