Royal Enfield Flying Flea C6: దేశీయంగా విద్యుత్ ద్విచక్ర వాహనాల పట్ల ఆదరణ పెరుగుతూనే ఉంది, మరియు ఏటా ఈ విభాగం విక్రయాల్లో దూసుకెళ్తోంది. ఇప్పటికే పలు సంస్థలు తమ ఎలక్ట్రిక్ బైక్‌లను మార్కెట్లో ప్రవేశపెట్టగా, తాజాగా ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) కూడా ఈ రంగంలో అడుగుపెట్టింది. బైక్ ప్రియులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్ బైక్‌ను రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) తాజాగా ఫ్లయింగ్ ఫ్లీ సీ6 (Flying Flea C6) పేరుతో ఆవిష్కరించింది.
ఫ్లయింగ్ ఫ్లీ సీ6 (Flying Flea C6) అనేది ఒక రెట్రో-ఫ్యూచరిస్టిక్ మోటార్ సైకిల్. ఇది రౌండ్ ఆకారంలో ఉన్న ఎల్‌ఈడీ హెడ్‌లైట్, ముందువైపు గిర్డర్ ఫోర్క్‌లతో డిజైన్ చేయబడింది. ఇందులో ఏబీఎస్ (ABS), ట్రాక్షన్ కంట్రోల్ (Traction Control) వంటి ఆధునిక సాంకేతికతలు కూడా అందుబాటులో ఉండనున్నాయి. ఈ బైక్‌లో రెండు సీట్ల వెర్షన్లు కూడా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక టీఎఫ్‌టీ డిస్‌ప్లే (TFT Display) కూడా ఈ బైక్‌లో ఉందని సమాచారం.
సింగిల్ ఛార్జింగ్‌తో 100-150 కిలోమీటర్ల వరకు రేంజ్ అందించే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield), ఇకపై మార్కెట్లోకి తీసుకొచ్చే అన్ని ఎలక్ట్రిక్ బైక్‌లను ‘ఫ్లయింగ్ ఫ్లీ’ (Flying Flea) బ్రాండు పేరిట విడుదల చేస్తామని ప్రకటించింది.
ఇప్పటికే రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) ఈ బైక్ యొక్క లుక్‌ను రివీల్ చేసినా, పూర్తి ఫీచర్లు మరియు ధర గురించి ఇంకా అధికారిక సమాచారం ఇవ్వలేదు. త్వరలోనే ఈ వివరాలు వెల్లడించబడే అవకాశముంది. 2026 నాటికి ఈ మోడల్ భారత మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
HashtagU కి అందుతున్న సమాచారం ప్రకారం:
ఫ్రేమ్: అల్లైడ్ అల్యూమీనియం ఫ్రేమ్
బ్యాటరీ: తక్కువ బరువుతో ఉండేందుకు మెగ్నీషియమ్ బ్యాటరీ ఉపయోగించారు.
డిజైన్: రౌండ్ హెడ్‌లైట్, ఫాక్స్ ఫ్యూయెల్ ట్యాంక్ లాంటి ఆకృతితో కూడిన డిజైన్, ఎల్‌ఈడీ లైటింగ్.
డిస్‌ప్లే: టీఎఫ్‌టీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ డిస్‌ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ.
సేఫ్టీ: ట్రాక్షన్ కంట్రోల్, కార్నింగ్ ఏబీఎస్, ముందు మరియు వెనక డిస్క్ బ్రేకులు.
రేంజ్: ఒకసారి ఛార్జ్ చేసిన తర్వాత 100-150 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు.