Royal Enfield Electric Bike: విడుదల కాకముందే రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ డిజైన్ లీక్.. లాంచ్ అయ్యేది అప్పుడే!

రాయల్ ఎన్‌ఫీల్డ్.. మార్కెట్లో ఈ బైకులకు ఉన్న క్రేజ్ డిమాండ్ గురించి మనందరికీ తెలిసిందే. ద్విచక్ర వాహన వినియోగదారులు ప్రతి ఒక్కరు కూడా ఈ బైక్ ని ఒక్క సారైనా కొనుగోలు చేయాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ చాలామంది ధరల కారణంగా వెనుకడుగు వేస్తూ ఉంటారు. ఇకపోతే

Published By: HashtagU Telugu Desk
Mixcollage 09 Jul 2024 05 15 Pm 2433

Mixcollage 09 Jul 2024 05 15 Pm 2433

రాయల్ ఎన్‌ఫీల్డ్.. మార్కెట్లో ఈ బైకులకు ఉన్న క్రేజ్ డిమాండ్ గురించి మనందరికీ తెలిసిందే. ద్విచక్ర వాహన వినియోగదారులు ప్రతి ఒక్కరు కూడా ఈ బైక్ ని ఒక్క సారైనా కొనుగోలు చేయాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ చాలామంది ధరల కారణంగా వెనుకడుగు వేస్తూ ఉంటారు. ఇకపోతే ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులు విడుదలైన విషయం తెలిసిందే. కానీ త్వరలో మార్కెట్లోకి ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ కానుంది. ఇందుకు సంబంధించి ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ డిజైన్ పేటెంట్ లీక్ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి.

ఇప్పటివరకు ఇందనంతో మాత్రమే నడిచే బైక్ లను మార్కెట్లోకి తీసుకువచ్చారు. కానీ త్వరలో రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ మోటర్ సైకిల్ ను తీసుకురాబోతున్నారట. ఇప్పుడిప్పుడే వార్తలు వినిపిస్తున్న తరుణంలో ఈ బైక్ ఇంకా మార్కెట్లోకి విడుదల కాకముందే ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ మోటర్ సైకిల్ డిజైన్ పేటెంట్ లీకైంది. వచ్చే ఏడాది 2025లో ఈ మోటార్ సైకిల్ లాంచ్ కానుందని సమాచారం.
రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ డిజైన్ ప్రకారం.. క్లాసికల్ గా డిజైన్ చేయబడింది. ఈ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ చూసేందుకు అద్భుతంగా ఉంటుంది. దీని ఛాసిస్ డిజైన్ పూర్తిగా ప్రత్యేకంగా ఉంటుంది. ఇది రాక్ అవుట్ ఫ్రంట్ ఎండ్, స్కూప్ అవుట్ సోలో శాడిల్, ఓపెన్, వంపు వెనుక ఫెండర్ కలిగి ఉంటుంది.

ఫ్యూయల్ ట్యాంక్ ప్రాంతంలోని లూపింగ్ ఫ్రేమ్ ప్రొడక్షన్ ఇతర మోటార్ సైకిళ్ల కంటే కాస్త భిన్నంగా ఉంటుంది. ఇది చూడటానికి హార్లే డేవిడ్సన్ క్రూయిజర్ మోటార్ సైకిల్ ను పోలి ఉంటుంది. అలాగే ఈ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ లో బ్యాటరీ ప్యాక్ ను ఫ్రేమ్ గా ఉపయోగించవచ్చని భావిస్తున్నారు. బ్యాటరీ కవర్, మోటార్ రెండింటినీ చుట్టూ అమర్చవచ్చు. ఇది హార్లే డేవిడ్సన్ ఎలక్ట్రిక్ బైక్ తయారీదారు లైవ్వైర్ తన ఎస్ 2 మోడల్‌తో చేసిన మాదిరిగానే ఉంటుంది. బైక్ కుడి వైపున బెల్ట్ డ్రైవ్, రెండు వైపులా డిస్క్ బ్రేక్ లు ఉంటాయి. ఈ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ లో ప్రధాన ఆకర్షణ ఫ్రంట్ సస్పెన్షన్ సెటప్. ఈ బైక్ ఎలక్ట్రిక్ 01 కాన్సెప్ట్ లో కనిపించింది. టాప్ డాగ్బోన్ బైక్ యొక్క మెయిన్ ఫ్రేమ్ కు ఫ్రంట్ ఫోర్క్ అసెంబ్లింగ్ ను జతచేస్తుందట.

అయితే రాబోయే ఆటో షోలో రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రదర్శించేందుకు కాన్సెప్ట్ కావొచ్చు అని కొందరు చెబుతున్నారు. ఇందులో ఆసక్తికరమైన డిజైన్ కూడా ఉందట. స్వింగర్మ్ అల్యూ మినియంతో తయారు చేయబడినట్లుగా, సాంప్రదాయ డిజైన్‌ ను కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఈ ఎలక్ట్రిక్ మోటారుపై ఎటువంటి వివరాలు లేవు. అయితే ఇది కొంచెం శక్తివంతంగా ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం, ఈ బైక్ పేరుపై ఎటువంటి సమాచారం లేదు. కానీ అంతర్గతంగా దీనిని ఎలక్ట్రిక్ 01 అని పిలుస్తున్నారట. బైక్ టైర్లు సన్నగా కనిపిస్తాయి. ఇది ఎలక్ట్రిక్ మోటార్‌ సైకిళ్లకు కీలకమైన అంశంగా చెప్పవచ్చు.

  Last Updated: 09 Jul 2024, 05:16 PM IST