Royal Enfield Bullet 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ బులెట్ 350 (Royal Enfield Bullet 350) కేవలం ఒక బైక్ మాత్రమే కాదు.. భారతదేశంలో ఒక ఐకానిక్ గుర్తింపు. దాదాపు ప్రతి బైక్ ప్రేమికుడూ ఈ మోటర్‌సైకిల్‌కు ఫిదా అవుతాడు. బైక్‌లో 349cc J-సిరీస్ ఇంజన్ ఉంది. ఇది 20.2 hp పవర్, 27 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇదే ఇంజన్ క్లాసిక్ 350, హంటర్ 350లో కూడా ఉంది. దీని 5-స్పీడ్ గేర్‌బాక్స్ రైడ్‌ను స్మూత్‌గా చేస్తుంది. లాంగ్ టూరింగ్‌లో కూడా అలసట రాదు.
డిజైన్ ఎలా ఉంది?
డిజైన్ విషయానికి వస్తే ఈ బైక్ ఇప్పటికీ తన రెట్రో లుక్‌తో వస్తుంది. ఇందులో రౌండ్ హెడ్‌లైట్స్, మెటల్ ఫ్యూయల్ ట్యాంక్, వైడ్ సైడ్ ప్యానెల్స్, దమ్దార్ థంప్ సౌండ్ ఉన్నాయి.
Also Read: Blaise Metreweli: యూకే గూఢచార సంస్థ MI6 మొదటి మహిళా చీఫ్‌గా బ్లేజ్ మెట్రెవెల్లి.. ఎవరీమె?
బులెట్ 350 కొత్త ధరల జాబితా
రాయల్ ఎన్‌ఫీల్డ్ తన ఐకానిక్ బైక్ బులెట్ 350 ధరలను వేరియంట్‌ను బట్టి 2,000 నుంచి 3,000 రూపాయల వరకు పెంచింది. జూన్ 2025 కోసం అప్‌డేటెడ్ ధరల జాబితా ప్రకారం.. మిలిటరీ రెడ్, బ్లాక్ వేరియంట్ ధర గతంలో రూ. 1,73,562 ఉండగా, ఇప్పుడు రూ. 1,75,562కు పెరిగింది. అలాగే స్టాండర్డ్ బ్లాక్, మెరూన్ వేరియంట్ ధర రూ. 1,79,000 నుంచి రూ. 1,81,000కు పెరిగింది. అత్యంత ఖరీదైన బ్లాక్ గోల్డ్ వేరియంట్ ఇప్పుడు రూ. 2,15,801కు బజాయ్ 2,000 కు,రూ. 18,801 లో లభిస్తుంది. ఈ ధరలన్నీ ఎక్స్-షోరూమ్ ఢిల్లీ ప్రకారం ఉన్నాయి.
ధరల పెంపునకు కంపెనీ శాస్త్రీయ కారణం చెప్పలేదు. కానీ ఆటో పరిశ్రమలో సాధారణంగా ఇన్‌పుట్ కాస్ట్ (స్టీల్, లేబర్, సప్లై చైన్) పెరగడం, కొత్త కలర్స్ లేదా గ్రాఫిక్స్‌ల మార్కెట్ పొజిషనింగ్‌ను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి మార్పులు చేస్తారు. ఇది బ్రాండ్ తమ ఉత్పత్తులను మార్కెట్ ట్రెండ్స్‌ల అనుసరించి అప్‌డేట్ చేస్తున్నట్టు సంకేతం.
ఫీచర్స్ ఎలా ఉన్నాయి?
ఫీచర్స్ విషయానికి వస్తే బులెట్ 350లో 349cc సింగిల్-సైలండర్, ఎయిర్-ఆయిల్ కూల్డ్ ఇంజన్ ఉంది. ఇది 6,100 rpm వద్ద 20.2 bhp పవర్, 4,000 rpm వద్ద 27 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో కలిసి ఉంటుంది. బ్రేకింగ్ సిస్టమ్‌లో ముందు డిస్క్, వెనుక డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి. భద్రత కోసం ABS సిస్టమ్ ఇవ్వబడింది. మిలిటరీ వేరియంట్‌లో సింగిల్ చానెల్, బ్లాక్ గోల్డ్ వేరియంట్‌లో డ్యూయల్ చానెల్ ABS లభిస్తాయి. కలర్ ఆప్షన్స్‌లో మిలిటరీ రెడ్, బ్లాక్, స్టాండర్డ్ మెరూన్, బలాక్ గోల్డ్ ఉన్నాయి.