Site icon HashtagU Telugu

River : తిరుపతిలో స్టోర్‌ను ప్రారంభించిన రివర్

River opens store in Tirupati

River opens store in Tirupati

River : బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ రివర్, తిరుపతిలో తమ స్టోర్‌ను ప్రారంభించింది. రివర్ స్టోర్ కస్టమర్‌లకు ఇండీ, యాక్సెసరీలు మరియు మర్చండైజ్ తో సహా అన్ని రివర్ ఉత్పత్తుల శ్రేణిని ప్రత్యక్షంగా చూసే అవకాశం అందిస్తుంది. దాదాపు 829 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న రివర్ స్టోర్ రేణిగుంట రోడ్డు లో సాస్త ఆటోమోటివ్ భాగస్వామ్యంతో ప్రారంభించబడింది.

Read Also:   Richest MLA : దేశంలోని సంపన్న ఎమ్మెల్యేల జాబితా.. ఏపీయే టాప్

తిరుపతిలోని ఈ స్టోర్ ఉత్సాహపూరితమైన వాతావరణాన్ని కలిగి ఉంది. నదీ ప్రవాహాన్ని గుర్తుకు తెచ్చే ‘ఫ్లో లైన్లు’ తో బ్రాండ్ యొక్క సౌందర్యాన్ని ప్రదర్శించడానికి వైవిధ్యంగా రూపొందించబడింది. స్టోర్ యొక్క సౌందర్యం లో ప్రధాన ఆకర్షణగా ఇండీ నిలుస్తుంది. మన రోజువారీ జీవితంలో ఇండీ ఎలా మిళితం అవుతుందో వర్ణిస్తూ అత్యంత జాగ్రత్తగా రూపొందించిన ప్రాంగణం ఇది . ఈ కథనం నది యొక్క తత్వానికి అనుగుణంగా ఉంటుంది. ప్రజలను వారు ఎక్కడ నుండి వచ్చారో మరియు వారు ఉండాలనుకుంటున్నారో అక్కడికి తీసుకువెళుతుంది.

గత ఏడాది డిసెంబర్‌లో విశాఖపట్నంలో స్టోర్‌ను ప్రారంభించడంతో రివర్ ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించింది. ఈ కంపెనీ ప్రస్తుతం బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, హుబ్లీ, విశాఖపట్నం, కొచ్చి, కోయంబత్తూరు మరియు మైసూరులో 13 అవుట్‌లెట్‌లను నిర్వహిస్తోంది. రాబోయే కొద్ది వారాల్లో రివర్ తమ కార్యకలాపాలను త్రివేండ్రం, వెల్లూరు, తిరుపూర్, బెల్గాం మరియు పూణేలకు విస్తరించనుంది. మార్చి 2025 చివరి నాటికి, భారతదేశం అంతటా 25 స్టోర్లను తెరవాలని రివర్ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇండీ ధర రూ1,42,999 (ఎక్స్-షోరూమ్, తిరుపతి). కస్టమర్‌లు టెస్ట్ రైడ్‌ల కోసం స్టోర్‌ని సందర్శించవచ్చు, మర్చండైజ్ ను బ్రౌజ్ చేయవచ్చు లేదా ఇండీని బుక్ చేసుకోవచ్చు. వారు www.rideriver.comలో టెస్ట్ రైడ్‌లను బుక్ చేసుకోవచ్చు లేదా ఆన్‌లైన్‌లో కొనుగోళ్లు చేయవచ్చు.

Read Also: Yuzvendra Chahal: చాహ‌ల్‌ విడాకులు.. ధ‌న‌శ్రీకి భారీగా భ‌ర‌ణం!