Site icon HashtagU Telugu

Emeya EV Car: త్వరలోనే మార్కెట్ లోకి సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ కార్.. లాంచ్ అయ్యేది అప్పుడే!

Mixcollage 18 Jun 2024 09 45 Pm 4047

Mixcollage 18 Jun 2024 09 45 Pm 4047

ప్రస్తుత రోజుల్లో రోజురోజుకీ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు ఉన్న క్రేజ్ డిమాండ్ పెరుగుతోంది. ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్యతో పాటు ఎలక్ట్రిక్ వినియోగదారుల సంఖ్య కూడా పెరగడంతో ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థలు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. ఒకదానిని మించి ఒకటి ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్ లోకి పోటాపోటీగా విడుదల అవుతున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఒక సరికొత్త కారు మార్కెట్‌ లోకి ఎంట్రీ ఇచ్చింది.

లోటస్‌ ఇమియా పేరతో లాంచ్‌ అయిన చార్జింగ్‌ వేగంలో ఏ కారు పోటీపడదని ఆ కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. మరి ఇంతకీ ఈ కారు ప్రత్యేకత ఏమిటి? ఈ కారులో ఎలాంటి ఫీచర్స్ ఉండనున్నాయి అన్న విషయానికొస్తే.. లోటస్‌ ఇమియా కేవలం 14 నిమిషాల్లో కేవలం 10 శాతం నుండి 80 శాతం చార్జింగ్‌ ఎక్కుతుంది. ఈ చార్జింగ్‌ తో సుమారు 320 కిలో మీటర్ల డ్రైవింగ్ పరిధిని ఆశ్వాదించవచ్చు. ముఖ్యంగా పీక్ ఛార్జింగ్ పీరియడ్‌ లలో అస్థిరమైన 402 కేడబ్ల్యూ పవర్‌ని ఉపయోగించుకుని వేగంగా చార్జ​ అవ్వడం ఈ కారు ప్రత్యేకతగా చెప్పవచ్చు.

అలాగే పోర్స్చే టైకాన్ వంటి కంపెనీల చార్జింగ్‌ పరిధి ఇప్పుడు ఇమియా కంటే తక్కువే అని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఈ కారులో అధునాతన 800 వోల్ట్ బ్యాటరీ ప్లాట్‌ఫారమ్‌ ను అభివృద్ధి చేయడం వల్ల ఇలాంటి ఫాస్ట్‌ చార్జింగ్ సాధ్యం అవుతుందని ఆ కంపెనీ ప్రతినిదులు చెబుతున్నారు. ఈ కారు బ్యాటరీ ప్యాక్ కచ్చితమైన ఇంజనీరింగ్ థర్మల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌తో వస్తుంది. అయితే హై-స్పీడ్ ఛార్జింగ్ వల్ల బ్యాటరీలు పాడవుకుండా ఎక్కువ రోజులు మన్నికలో ఉండేలా లోటస్‌ ప్రత్యేక చర్యలు తీసుకుంది. కాగా ఈ ఇమియా కారు పనితీరు ప్రస్తుతం ఈవీ వాహనాల పనితీరుకు భిన్నంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ సూపర్‌ స్పీడ్‌ కారు లాంచింగ్‌ వల్ల 350 కేడబ్ల్యూ కంటే ఎక్కువ సామర్థ్యాలతో అధిక-పవర్ ఛార్జింగ్ నెట్‌వర్క్‌ల విస్తృత విస్తరణకు ఇతర కంపెనీలు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అలాగే ఇక్కడితో ఆగకుండా లోటస్‌ ఇమియా 450 కేడబ్ల్యూ చార్జర్లను అభివృద్ధి చేసే పని కూడా ఉంది.