Site icon HashtagU Telugu

Revolt RV400 BRZ : మార్కెట్లోకి విడుదల అయిన మరో సరికొత్త ఎలక్ట్రిక్ బైక్.. ధర ఫీచర్స్ మామూలుగా లేవుగా?

Mixcollage 24 Jan 2024 06 31 Pm 5663

Mixcollage 24 Jan 2024 06 31 Pm 5663

ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో రకాల ఎలక్ట్రిక్ బైక్లు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. వీటితోపాటు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లు కలిగిన ఎలక్ట్రిక్ బైక్ లు మార్కెట్లోకి విడుదల అవుతూనే ఉన్నాయి. మార్కెట్లో రోజురోజుకీ ఎలక్ట్రిక్ వాహనాలకు ఉన్న డిమాండ్ విపరీతంగా పెరిగిపోతుండడంతో వాహన తయారీ సంస్థలు కూడా ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలనే మార్కెట్ లోకి విడుదల చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నాయి. అందులో భాగంగానే తాజాగా మరో ఎలక్ట్రిక్ బైక్ మార్కెట్ లోకి వచ్చేసింది. రివోల్ట్‌ మోటార్స్‌ కంపెనీ తాజాగా ఎలక్ట్రిక్ బైక్‌ ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది..

ఆకర్షణీయమైన డిజైన్‌, అద్భుతమైన ఫీచర్లతో ఈ బైక్‌ను ప్రవేశపెట్టింది. మరి ఈ బైకు సంబంధించిన ధర ఫీచర్ల విషయానికొస్తే.. హర్యానాకు చెందిన ఆటో కంపెనీ రివోల్ట్‌ మోటార్స్‌ సరికొత్త ఎలక్ట్రిక్‌ బైక్‌ను ప్రవేశపెట్టింది. RV400 బైక్‌ యొక్క కొత్త వేరియంట్‌ RV400 BRZ ఎలక్ట్రిక్‌ బైక్‌ను లాంచ్‌ చేసింది. కాగా ఈ బైక్ బ్యాటరీ విషయానికొస్తే.. కొత్త రివోల్ట్ RV400 BRZ ఎలక్ట్రిక్ బైక్‌లో 72V 3.24 kWh లిథియం, అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగించారు. ఈ సరికొత్త ఎలక్ట్రిక్‌ బైక్ బ్యాటరీ కేవలం 3 గంటల్లో 75 శాతం ఛార్జ్ అవుతుందని పూర్తిగా ఛార్జ్ చేయడానికి 4.5 గంటల సమయం పడుతుందని కంపెనీ తెలిపింది.

ఇక రివోల్ట్ మోటార్స్‌ కొత్త RV400 BRZ ఎలక్ట్రిక్‌ బైక్‌లో మూడు రైడింగ్ మోడ్‌లను అందిస్తోంది. అవి ఎకో, నార్మల్‌, స్పోర్ట్‌ మోడ్‌లు. పూర్తి ఛార్జ్‌ చేసినప్పుడు ఈ మోడ్‌లలో వరుసగా బైక్‌ 150 కి.మీ, 100 కి.మీ మరియు 80 కి.మీ రేంజ్‌ను అందిస్తున్నాయి. ఈ రివోల్ట్ RV400 BRZ ఎలక్ట్రిక్ టూ వీలర్‌ కాంబి బ్రేకింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఇందులో సైడ్-స్టాండ్ కట్-ఆఫ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పాటుగా అనేక ఫీచర్స్ ను కలిగి ఉంది. అలాగే ఈ కొత్త బైక్ మనకు లూనార్ గ్రీన్, పసిఫిక్ బ్లూ, డార్క్ సిల్వర్, రెబెల్ రెడ్‌ వంటి కలర్స్ లలో లభించనుంది. ఇక అదిరిపోయే ఫీచర్స్ ను కలిగిన ఈ బైకు ధర విషయానికొస్తే.. 1.34 లక్షలుగా ఉంటుందని కంపెనీ వెల్లడించింది.