ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ రివోల్ట్ తాజాగా మార్కెట్లోకి తన కొత్త రివోల్ట్ ఆర్ వి వన్ ఎలక్ట్రిక్ బైక్ ను విడుదల చేసింది. అయితే ఈ ఈవీ బైక్ ని ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ తయారీ విభాగంలో అగ్రగామిగా ఉన్న రివోల్ట్ మోటార్స్ విడుదల చేసింది. ఈ బైక్ ని రెండు ప్రధాన వేరియంట్ లతో మార్కెట్ విడుదల చేసింది. ఇకపోతే తాజాగా విడుదల చేసిన ఈ బైకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. కాగా కొత్త ఎలక్ట్రిక్ బైక్ ధర విషయానికి వస్తే.. ధర రూ. 84,990 గా ఉంది. అలాగే టాప్ ఎండ్ మోడల్ ధర రూ. 99,990 గా ఉంది. ప్రస్తుతం భారతీయ ద్విచక్ర వాహనాల మార్కెట్ లో మోటార్ సైకిళ్లు చెలాయిస్తున్నాయి.
మార్కెట్లో పెరుగుతున్న కస్టమర్లను దృష్టిలో ఉంచుకున్న రీవోల్ట్ సంస్థ కొత్త కొత్త ఫీచర్లు కలిగిన బైక్స్ ని, ఆకర్షణీయమైన ధరలకు అందిస్తోంది. అలాగే గొప్ప మైలేజీ తో ఈవీ మోటార్ సైకిల్ మోడల్ లను పరిచయం చేస్తోంది. ప్రస్తుత మార్కెట్ లో ఇప్పటికే రివోల్ట్ 400 సిరీస్ ఈవీ బైక్ మోడళ్లను విక్రయిస్తున్న రివోల్ట్ మోటార్స్. ఇప్పుడు RV1 ఈవీ బైక్ ను విడుదల చేసింది. బడ్జెట్ ఈవీ బైక్ కొనుగోలుదారులకు ఇది గొప్ప ఎంపిక అని చెప్పవచ్చు. ఇది పెట్రోల్ మోటార్ సైకిళ్ల కంటే మూడు రెట్లు ఎక్కువ ఇంధనాన్ని ఆదా చేస్తుందట. ఇకపోతే ఈ కొత్త రివోల్ట్ RV1 ఎలక్ట్రిక్ బైక్ రెండు రకాల బ్యాటరీలను అందిస్తోంది.
కొత్త బైక్ ప్రారంభ మోడల్ 2.2 KVH బ్యాటరీ ప్యాక్ తో అమర్చబడి ఉంటుంది. ఇది గరిష్టంగా 100 కి.మీ మైలేజీని అందిస్తుంది. అలాగే టాప్ ఎండ్ మోడల్ 3.24 KVH బ్యాటరీ ప్యాక్ తో అందిస్తుంది. ఇది ఒక్కసారి ఛార్జ్ పై గరిష్టంగా 160 కి.మీ మైలేజీని అందిస్తుందని కంపెనీ చెబుతోంది. 2.2 KVH బ్యాటరీతో మోడల్ సున్నా నుండి 80 శాతానికి ఛార్జ్ చేయడానికి గరిష్టంగా 2 గంటల 15 నిమిషాలు పడుతుండగా, అదే 3.24 KVH బ్యాటరీకి 3 గంటల 30 నిమిషాల సమయం పడుతుందని కంపెనీ వెల్లడించింది. అయితే తక్కువ ధరకే అద్భుతమైన మైలేజ్ ఇచ్చే బైక్ కొనుగోలు చేయాలి అనుకుంటున్నా వారికి ఇది బెస్ట్ ఎంపిక అని చెప్పవచ్చు…