Site icon HashtagU Telugu

Honda Electric Scooter: హోండా యాక్టివా ఈవీ రిలీజ్ కీ ముహూర్తం ఫిక్స్.. విడుదల ఎప్పుడో తెలుసా?

Honda Electric Scooter

Honda Electric Scooter

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల బైకులను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో రకాల బైకులను విడుదల చేసిన హోండా సంస్థ ఇప్పుడు మొదటి ఎలక్ట్రిక్ వెహికల్ ను మార్కెట్ లోకి విడుదల చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేసింది. నవంబర్ 27న గ్రాండ్ గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేసింది. కొత్తగా విడుదలవుతున్న యాక్టివా ఈవీపై కూడా మార్కెట్ లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో హోండా సంస్థకు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

హోండా బ్రాండ్ కి మంచి ఆదరణ లభించింది. అయితే ఇప్పటికే మార్కెట్లోకి విడుదలైన ప్రముఖ ఈవీ వాహనాలకు యాక్టివా గట్టి పోటీని ఇస్తుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా ప్రస్తుతం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో దాదాపు అన్ని కంపెనీలు ఈ విభాగంలో వాహనాలను విడుదల చేశాయి. కానీ హోండా మాత్రం ఇప్పటి వరకూ ఈవీ విభాగంలోకి రాలేదు. కొంచె ఆలస్యం అయినప్పటికీ ఈవీ మార్కెట్ లో తన స్థానాన్ని మెరుగుపర్చుకోవడానికి హోండా చర్యలు ప్రారంభించింది. దీనిలో భాగంగా యాక్టివాను ఎలక్ట్రిక్ విభాగంలో విడుదల చేయనుంది.

జపాన్ కు చెందిన హోండా కంపెనీ తన యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ టీజర్ ను ఇటీవల విడుదల చేసింది. నవంబర్ 27వ తేదీన ఈ స్కూటర్ ను విడుదల చేయనున్నట్టు తెలిపింది. దీర్ఘచతురస్రాకార ఎల్ ఈడీ హెడ్ లైట్లు, రీమూవబుల్ బ్యాటరీలతో ఎంతో ఆకట్టుకుంటోంది. అదుర్స్ అనిపించే డిజైన్, ముందు అప్రాన్ పై హెడ్ లైట్, ఫ్లఫ్ పిట్టింగ్ పిలియన్ ఫుట్ రెస్టులు, టైల్ లైట్ బార్ ఆకట్టుకుంటున్నాయి. ఇకపోతే ఈ బైక్ ఫీచర్ల విషయానికి వస్తే..

ఏడు అంగుళాల టీఎఫ్ టీ డిస్ ప్లే, కీలెస్ గో, ఎల్ ఈడీ లైటింగ్, యూఎస్బీ సీ సాకెట్, మూడు రైడింగ్ మోడ్ లు, రివర్స్ అసిస్ట్ ఏర్పాటు చేశారు. ఇక కనెక్టివిటీ ఫంక్షన్ల కోసం హోండా రోడ్ సింక్ డ్యుయో యాప్ ను కూడా అందిస్తున్నారు. అయితే సీట్ కింద ఏర్పాటు చేసిన రిమూవబుల్ బ్యాటరీల కారణంగా స్టోరేజ్ చేసుకునే అవకాశం ఉండదు. హోండా యాక్టివా ఈవీ పనితీరు గతంలో విడుదలైన 125 సీసీ ఐసీఈ స్కూటర్ మాదిరిగానే ఉంటుందని కంపెనీ ప్రకటించింది. ఒక్కసారి చార్జింగ్ చేస్తే దాదాపు 100 కిలోమీటర్ల మైలేజీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కీ సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనుంది హోండా సంస్థ.