Lamborghini Sales 2023 : రికార్డు స్థాయిలో విక్రయాలు తెలిపిన లంబోర్గినీ కార్.. చరిత్రలో ఫస్ట్ టైమ్ అలా?

ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థల్లో లంబోర్ఘిని కూడా ఒకటి. ఈ లంబోర్ఘిని కార్ల ధరలు ఏ రేంజ్ లో ఉంటాయో మనందరికీ తెలిసిందే. చాలామంది వీటిని కొన

  • Written By:
  • Publish Date - January 18, 2024 / 03:35 PM IST

ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థల్లో లంబోర్ఘిని కూడా ఒకటి. ఈ లంబోర్ఘిని కార్ల ధరలు ఏ రేంజ్ లో ఉంటాయో మనందరికీ తెలిసిందే. చాలామంది వీటిని కొనుగోలు చేయాలి అనుకున్నప్పటికీ వీటి ధరలు కారణంగా వెనుకడుగు వేస్తూ ఉంటారు. అయితే వీటి ధర కోట్లలో ఉన్నప్పటికీ కొనుగోలు దారులు మాత్రం అస్సలు తగ్గడం లేదు. దీనికి గత ఏడాది జరిగిన విక్రయాలు చక్కటి ఉదాహరణగా చెప్పవచ్చు. ఎప్పుడు లేని విధంగా గత ఏడాది రికార్డు స్థాయిలో విక్రియలు జరిపింది లంబోర్ఘిని. చరిత్రలోనే మొట్టమొదటిసారి ఏకంగా అన్ని విక్రయాలు జరిపి రికార్డు సృష్టించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. లంబోర్ఘిని 2023లో రికార్డుల మోత మోగించింది.

ఒక క్యాలెండర్ సంవత్సరంలో ఏకంగా 10వేల యూనిట్లకు పైగా కార్లను విక్రయించింది. తద్వారా 2023 ఏడాదిలో కంపెనీ చరిత్రలోనే మొదటిసారిగా 10,112 యూనిట్ల కార్లను విక్రయించి రికార్డు క్రియేట్ చేసింది. తద్వారా ఏడాదికి 10శాతం వృద్ధిని నమోదు చేసింది. గత ఏడాదిలో ఇటాలియన్ బ్రాండ్ తన 60వ వార్షికోత్సవాన్ని కూడా జరుపుకుంది. యూరప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా ప్రాంతం నుంచి 3,987 యూనిట్లను విక్రయించింది. దాంతో కంపెనీకి బాగా కలిసొచ్చింది. అమెరికాలో 3,465 యూనిట్లు, ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో 2,660 యూనిట్లను విక్రయించింది. 2023లో EMEA ప్రాంతం అమ్మకాలలో 14శాతం వృద్ధిని సాధించింది. అదే సంవత్సరంలో అమెరికాలో వాల్యూమ్ 9శాతం, APAC ప్రాంతంలో 4శాతం వృద్ధి పెరిగింది.

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో 3వేల కార్లు డెలివరీ చేసి టాప్ మార్కెట్‌గా కొనసాగింది. జర్మనీ (961 కార్లు), చైనా (845 కార్లు), దక్షిణ కొరియా (434 కార్లు), ఇటలీ (409 కార్లు), కెనడా (357 కార్లు), ఆస్ట్రేలియా (263 కార్లు), యునైటెడ్ కింగ్‌డమ్ (801 కార్లు), జపాన్ (660 కార్లు), మిడిల్ ఈస్ట్ (496 కార్లు) , ఫ్రాన్స్ అండ్ మొనాకో (255 కార్లు), స్విట్జర్లాండ్ (211 కార్లు), తైవాన్ (131 కార్లు), ఇండియా (103 కార్లు)ను విక్రయించింది.
మోడల్ స్ప్లిట్ పరంగా.. లంబోర్ఘిని ఉరుస్ మోడల్ 6,087 యూనిట్ల వద్ద ఆధిక్యంలో కొనసాగింది. హురాకాన్ 3,962 యూనిట్ల వద్ద ఆ తర్వాతి స్థానంలో నిలిచింది. అలాగే, వి12తో కూడిన 63 కార్లు డెలివరీ అయ్యాయి. ఇందులో చివరి 12, 51 కొన్ని ఇతర మోడల్స్ ఉన్నాయి. కాగా హై-పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిఫైడ్ వెహికల్ హైబ్రిడ్ సూపర్ స్పోర్ట్స్ కారును కూడా లాంచ్ చేసింది. దీని ఆర్డర్‌లు వచ్చే 2026 చివరి వరకు ఉత్పత్తిని అందించనున్నాయి. అంతేకాకుండా, కంపెనీ లంబోర్ఘిని లాంజాడార్ కాన్సెప్ట్ కారును కూడా ఆవిష్కరించింది. 2024లో జరిగే (FIA) వరల్డ్ ఎండ్యూరెన్స్ ఛాంపియన్‌షిప్, (IMSA) వెదర్‌టెక్ స్పోర్ట్స్‌కార్ ఛాంపియన్‌షిప్‌లో (LMDh) కేటగిరీ రేసింగ్ కారు లంబోర్ఘిని ఎస్‌సీ63ని కూడా ఆవిష్కరించింది.