Range Rover Velar: రూ.94 లక్షలుకు రేంజ్ రోవర్ సరికొత్త కార్.. ఫీచర్స్ మామూలుగా లేవుగా?

జాగ్వార్ ల్యాండ్ రోవర్ తాజాగా కొత్తగా భారత్ లోకి SUV విభాగంలో రేంజ్ రోవర్ వెలార్ కొత్త వర్షన్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇకపోతే ఈ కారు ధర

Published By: HashtagU Telugu Desk
Range Rover Velar

Range Rover Velar

జాగ్వార్ ల్యాండ్ రోవర్ తాజాగా కొత్తగా భారత్ లోకి SUV విభాగంలో రేంజ్ రోవర్ వెలార్ కొత్త వర్షన్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇకపోతే ఈ కారు ధర విషయానికి వస్తే.. ఎక్స్ షోరూమ్ వద్ద రూ. 94.3 లక్షలు గా ఉంది. ఈ కారు లోపల భాగం ఎంతో విశాలంగా ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఇది 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో 246 bhp పవర్ 365 nm టార్క్ ను అందించగలదు. అలాగే 2.0 లీటర్ ఇంజెనియం డీజిల్ ఇంజన్ 201 bhp పవర్ 420 nm టార్క్ ను విడుదల చేస్తుంది. ఈ రెండు ఇంజన్లు స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో వచ్చాయి.

అలాగే ఈ కారు ముందు ఎల్ఈడి లైట్లు లోపల నాలుగు జోన్ క్లైమేట్ కంట్రోల్, 360 డిగ్రీ పార్కింగ్ కెమెరా, వెంటిలేషన్ ఫంక్షన్లతో ఫ్రెంట్ సీట్లు, హీటింగ్, పవర్డ్ టెయిల్ గేట్ ప్రీమియం మెరిడియన్ , సౌండ్ సిస్టం, అడాప్టివ్ ఎయిర్ సస్పెన్షన్ సిస్టమ్ , 11.4 అంగుళాల టచ్ స్క్రీన్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో వంటి ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. అయితే ఈ కారుకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ కారు ఇంకా ఏ కలర్స్ లో లభించనుంది. ఈ కారు స్పెసిఫికేషన్లో వంటి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

  Last Updated: 17 Sep 2023, 05:50 PM IST