Site icon HashtagU Telugu

Bajaj Pulsar RS200: పల్సర్ బైక్ లవర్స్ కి గుడ్ న్యూస్.. మార్కెట్ లోకి ఆర్ఎస్ 200కు అప్‌డేటెడ్ వెర్షన్‌!

Bajaj Pulsar Rs200

Bajaj Pulsar Rs200

ఇండియాలో పల్సర్ బైక్స్ కి ఉన్న డిమాండ్ గురించి మనందరికీ తెలిసిందే. ద్విచక్ర వాహన వినియోగదారులు ఎక్కువ శాతం మంది ఇష్టపడే బైక్స్ లో ఈ బైక్స్ కూడా ఒకటి. ముఖ్యంగా పల్సర్ బైక్ లుక్ అందరినీ ఆకర్షిస్తూ ఉంటుంది. అయితే గత కొంత కాలంలో పల్సర్ ఆర్ఎస్ బైక్‌ కు ఎలాంటి అప్‌డేట్ రాలేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా బజాజ్ కంపెనీ ఆర్ఎస్ 200కు అప్‌డేటెడ్ వెర్షన్‌ ను రిలీజ్ చేసింది. బజాజ్ ఆటో ఎట్టకేలకు అప్‌డేటెడ్ బజాజ్ పల్సర్ ఆర్ఎస్ 200 బైక్‌ను భారత మార్కెట్లో ఇటీవల విడుదల చేసింది. దాదాపు దశాబ్దం తర్వాత ఇదే మొదటి అప్‌డేట్ అని మార్కెట్ రంగ నిపుణులు చెబుతున్నారు.

కాగా ఈ అప్‌డేటెడ్ ఆర్ఎస్ 200 ధర ఇప్పుడు రూ.1.84 లక్షలకు చేరుకుంది. అంటే గత వెర్షన్‌ తో పోలిస్తే రూ.10,000 ఎక్కువ అన్నమాట. కస్టమర్లు మోటార్ సైకిల్‌ ను ఆన్‌లైన్‌ లో బుక్ చేసుకోవచ్చు. లేదంటే వారి సమీప బజాజ్ డీలర్‌ ను సంప్రదించి బుక్ చేసుకోవచ్చట. బజాజ్ పల్సర్ ఆర్ఎస్ 200 నయా వెర్షన్‌ ను డిజైన్ పరంగా పెద్దగా మార్పులు లేవు. ముందువైపు మోటార్ సైకిల్ మునుపటిలానే కనిపిస్తుంది. ఈ బైక్ మూడు డాట్ డీఆర్ఎల్‌ లతో కూడిన ట్విన్ పాడ్ ఎల్ఈడీ హెర్లాంప్ సెటప్‌ తో ఆకర్షిస్తుంది. ఈ బైక్‌ లో సిట్ బ్రాకెట్ ఆకారపు ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ టైలైట్లను కలిగి ఉంది. బజాజ్ పల్సర్ డిజైన్ పరంగా పాత మోడల్‌ను అనుకరించినా పనితీరు విషయంలో మాత్రం మంచి అప్‌డేట్స్ ఇచ్చింది. బజాజ్ పల్సర్ నలుపు, తెలుపు, ఎరుపు మూడు రంగుల ఎంపికలతో అందిస్తున్నారు.

ఈ మోటార్ సైకిల్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్లను వెనుక వైపున మోనో షాక్ సెటప్‌ తో వస్తుంది. ఈ బైక్ డ్యూయల్ ఛానల్ ఏబీఎస్‌తో రెండు చివర్లలో డిస్క్ బ్రేక్లతో వస్తుంది. అలాగే కలర్ ఎల్‌సీడీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, కొత్త స్విచ్ గేరు యువతను అమితంగా ఆకర్షిస్తుందట. అలాగే పల్సర్ ఆర్ఎస్ 200 బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ నావిగేషన్, కాల్ నోటిఫికేషన్ అలర్ట్లను పొందవచ్చు. ఈ బైక్‌ లో మూడు రైడింగ్ మోడ్లను పొందవచ్చు. పల్సర్ ఆర్ఎస్ 200 9,750 ఆర్‌పీఎం వద్ద 24.5 హెచ్‌పీ శక్తిని, 8,000 ఆర్‌పీఎం వద్ద 18.7ఎన్ఎం, స్లిప్పర్ క్లబ్‌లో 6 స్పీడ్ గేర్బాక్స్ జత చేసేలా లిక్విడ్ కూల్డ్ 199 సీసీ , సింగిల్ సిలిండర్ ఇంజన్‌ తో వస్తుంది. భద్రత పరంగా ఈ బైక్ డ్యూయల్ ఛానల్ ఏబీఎస్‌ ను అందిస్తుందట.