E Vehicles: ఈ -వెహికల్స్ పై గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు…!!

ఇండియాలో పెట్రోల్ వెహికల్స్ తో పోల్చుకుంటే...ఎలక్ట్రిక్ వాహనాల ధరలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలకు ఎలక్ట్రిక్ వాహనాలు కొనడం అసాధ్యంగా మారుతుంది. రాబోయే రెండు సంవత్సరాల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ ధరలకు పెట్రోలు వెహికల్స్ తో సమానంగా ఉంటాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పుకొచ్చారు.

  • Written By:
  • Publish Date - April 1, 2022 / 03:59 PM IST

ఇండియాలో పెట్రోల్ వెహికల్స్ తో పోల్చుకుంటే…ఎలక్ట్రిక్ వాహనాల ధరలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలకు ఎలక్ట్రిక్ వాహనాలు కొనడం అసాధ్యంగా మారుతుంది. రాబోయే రెండు సంవత్సరాల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ ధరలకు పెట్రోలు వెహికల్స్ తో సమానంగా ఉంటాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పుకొచ్చారు. గురువారం పార్లమెంటులో క్వచ్చన్ అవర్ సమయంలో ఎలక్ట్రిక్ వాహనాలు, ఛార్జింగ్ స్టేషన్ల గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. రెండు సంవత్సరాల్లో ఎలక్ట్రిక్ టూ వీలర్స్, ఎలక్ట్రిక్ త్రీవీలర్స్ , ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్స్ ధరలు పెట్రోలు వాహనాల ధరల మాదిరిగానే ఉంటాయని…దేశంలో మార్పు వస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు.

పార్లమెంట్ ఆవరణలో ఛార్జింగ్ స్టేషన్ల కోసం స్థలం ఇవ్వాలని లోకసభ స్పీకర్ ఓం బిర్లాను గడ్కరీ అభ్యర్థించారు. ఛార్జింగ్ స్టేషన్ ను ఇన్ స్టాల్ చేసిన తర్వాత ఎంపీలు, ఈవీలను కొనుగోలు చేయవచ్చని చెప్పారు. ప్రతి ప్రభుత్వ ప్రాంగంణలో పార్కింగ్ సిస్టమ్ లో విద్యుత్ ఛార్జింగ్ ఫెసిలిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు గడ్కరీ చెప్పుకొచ్చారు. ఇక కేంద్ర రవాణా మంత్రి ప్రకారం…విద్యుత్ మంత్రిత్వశాఖ ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను జారీ చేసింది.

ఇక రెండు రోజుల కిందట అంటే బుధవారం నాడు నితిన్ గడ్కరీ హైడ్రోజన్ తో నడిచే కారు టొయోటా మిరాయ్ లో పార్లమెంటుకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంలో హైడ్రోజన్ ఇంధనమే భవిష్యత్తు అని చెప్పారు. పెట్రోలు, డీజీల్ ఫ్యూయల్ కు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిసిటి, గ్రీన్ హైడ్రోజన్, ఇథనాల్, బయో డిజిల్ వంటి ఇంధనాలు ఉన్నాయి. ఇలాంటి ఇందనాలను మన దేశంలో తయారు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు మంత్రి అన్నారు .

మంత్రి గడ్కరీ ప్రయాణిస్తున్న కారును జపాన్ కు చెందిన టొయోటా కంపెనీ తయారు చేసింది. ఈ కారులో హైడ్రోజన్ ఫ్యూయల్ ను ఫరీదాబాద్ లోని ఇండియన్ ఆయిల్ పంప్ నుంచి ఫిల్ చేశారు. ఆత్మ నిర్భర్ గా మారేందుకు మేం నీటి నుంచి ఉత్పత్తి చేసిన గ్రీన్ హైడ్రోజన్ను పరిచయం చేస్తాం. ఈ కారు పైలట్ ప్రాజెక్టు. ఇప్పుడు దేశంలో గ్రీన్ హైడ్రోజన్ తయారీ ప్రారంభం అవుతుంది. దీంతో దిగుమతులను అరికట్టడంతోపాటు కొత్త ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని మంత్రి చెప్పారు.

భవిష్యత్తులో ఫ్యూయల్ ను ఉపయోగించడమని చాలా అరుదు అని ప్రజలను ప్రోత్సహించేందుకు త్వరలోనే ఢిల్లీ రోడ్లపై హైడ్రోజన్ ఇంధనంతో నడిచే కారులో తాను కనిపిస్తానని గతంలోనే గడ్కరీ చెప్పారు. తాను చెప్పినట్లుగానే హైడ్రోజన్ కారులో తిరుగుతున్నారు.