Pravaig Defy electric SUV: ప్రవాగ్ డిఫై ఎలక్ట్రిక్ ఎస్​యూవీ కార్.. ధర ఫీచర్లు ఇవే?

బెంగళూరు బేస్డ్ ఆటోమోటివ్ స్టార్టప్ కంపెనీ ప్రవాగ్ తాజాగా మొట్ట మొదటి ఎలక్ట్రిక్ ఎస్​యూవీ డిఫై కార్ ని లాంచ్

  • Written By:
  • Publish Date - November 26, 2022 / 03:39 PM IST

బెంగళూరు బేస్డ్ ఆటోమోటివ్ స్టార్టప్ కంపెనీ ప్రవాగ్ తాజాగా మొట్ట మొదటి ఎలక్ట్రిక్ ఎస్​యూవీ డిఫై కార్ ని లాంచ్ చేసింది. కాగా ఈ డిఫై ఎలక్ట్రిక్ ఎస్ యు వి మ్యానుఫ్యాక్చరింగ్ ను వచ్చే ఏడాది రెండవ భాగంలో నుంచి ప్రారంభించబోతున్నట్లు ప్రవైగ్ తెలిపింది. కాగా తాజాగా దేశీయ మార్కెట్ లోకి విడుదలైన కొత్త ప్రవైగ్ డిఫై ధర రూ. 39.50 లక్షలు ఎక్స్-షోరూమ్ గా ఉంది. అయితే ప్రవైగ్ కంపెనీ ఈ ఎస్​యూవీ కోసం బుకింగ్స్ కూడా ప్రారంభించింది. ఆసక్తి ఉన్న వినియోగదారులు రూ. 51,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. కానీ డెలివరీలు 2023 ఏప్రిల్ నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది.

ఈ ఎస్​యూవీ కార్ ని చాలా వరకు ఒక కొత్త డిజైన్ తో రూపొందించారు. ఇందులో పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్‌ కూడా అందుబాటులో ఉంటుంది. డీఫై ఎలక్ట్రిక్​ పొడవు 4,960 ఎంఎంగా ఉంది. ఇందులో గ్రౌండ్​ క్లియరెన్స్​ 234 ఎంఎం, లెగ్​ రూమ్​ 1215 ఎంఎంగా ఉంది. హెడ్​ రూఫ్​ 1050 ఎంఎం గా ఉంది. రికవర్డ్​ నైలాన్​, పీఈటీ బాటిళ్ల నుంచి టెక్నికల్​ టెక్స్​టైల్​, వేగన్​ లేథర్​ను ఈ వాహనంలో ఉపయోగిస్తోంది. ప్రవాగ్ ​ డిఫై ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ లో గ్లాస్​ స్మూత్​ సస్పెన్షన్​ను ఉపయోగిస్తున్నారు. ఒక్కసారి ఛార్జ్​ చేస్తే ఈ కార్ ​ 500కి.మీల వరకు ప్రయాణిస్తుంది.

డిఫై ఎలక్ట్రిక్​ టాప్​ స్పీడ్​ 210కేఎంపీహెచ్​. 400 బీహెచ్​పీ పవర్​, 620 ఎన్​ఎం టార్క్​ను ఇది జనరేట్​ చేస్తుంది. ఇంటిగ్రేటెడ్ రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్‌, టెయిల్‌గేట్ మరియు లైట్‌బార్ స్టైల్ టైల్‌లైట్‌లను చూడవచ్చు. ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులో 15.6 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే ఉంటుంది. ప్రవాగ్ నుంచి వస్తున్న తొలి ఎలక్ట్రిక్ ఎస్​యూవీ ఈ డిఫై. ఇందుకు సంబంధించిన బుకింగ్స్ కూడా సంస్థ మొదలుపెట్టింది.