Zulu Scooter: మార్కెట్లోకి విడుదలైన మరో ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్స్ మామూలుగా లేవుగా?

భారతదేశపు ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ కైనెటిక్ గ్రీన్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ జులు ఎలక్ట్రిక్ స్కూటర్ ను త

Published By: HashtagU Telugu Desk
Mixcollage 13 Dec 2023 06 05 Pm 8590

Mixcollage 13 Dec 2023 06 05 Pm 8590

భారతదేశపు ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ కైనెటిక్ గ్రీన్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ జులు ఎలక్ట్రిక్ స్కూటర్ ను తాజాగా విడుదల చేసింది. ఇందులో అద్భుతమైన ఫీచర్లను అందించింది. మరి తాజాగా విడుదల చేసిన ఈ జులు ఎలక్ట్రిక్ స్కూటర్ కి సంబంధించిన ధర ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఒకసారి చార్జ్ చేస్తే చాలు 104 కిలోమీటర్లు మైలేజ్ ఇస్తుంది. 15-amp సాకెట్‌తో కేవలం 30 నిమిషాల్లో 80 శాతం వరకు అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ అవుతుంది. కాబట్టి ఛార్జింగ్ సమయం కూడా చాలా తక్కువ. అత్యాధునిక KG Ener-G బ్యాటరీ ప్లాట్‌ ఫారమ్ కైనెటిక్ గ్రీన్ జులులో ప్రవేశపెట్టారు.

అన్నీ స్మార్ట్ BMS అండ్ AI ఆధారిత బ్యాటరీ హెల్త్ ప్రిడిక్షన్ సిస్టమ్ ద్వారా ఇంటి గ్రేటెడ్ చేయబడతాయి. ఈ బ్యాటరీ ప్లాట్‌ ఫారమ్ బ్యాటరీ పర్ఫార్మెన్స్, ఎండ్యూరెన్స్ అండ్ సేఫ్టీ గణనీయంగా మెరుగుపరుస్తుంది. అలాగే మార్కెట్ స్టాండర్డ్ కంటే చాలా రెట్లు మెరుగ్గా ఉంటుంది. ఇకపోతే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ద్వారా విషయానికి వస్తే.. దీని ధర రూ. 95,000 ఎక్స్-షోరూమ్ గా ఉంది. జులు తో Kinetic Green మొట్టమొదటి బ్యాటరీ యాజ్ ఎ సబ్‌స్క్రిప్షన్ పథకంతో విప్లవాత్మక యాజమాన్య అనుభవంతో సరిహద్దులను మరింత ముందుకు నెట్టింది. స్టైలిష్ జులు 60 kmph వేగంతో ఆహ్లాదకరమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది. 160 mm గ్రౌండ్ క్లియరెన్స్ అందించినప్పటికీ, వివిధ రకాల రోడ్డు ఉపరితలాలకు అనుకూలంగా ఉంటుంది.

జులు 2.27 కిలోవాట్ లియోన్ బ్యాటరీ సామర్థ్యంతో పోర్టబుల్ ఛార్జర్‌తో వస్తుంది.అలాగే ఇంట్లో సౌకర్యవంతమైన ఛార్జింగ్‌ ను కూడా అందిస్తుంది. అలాగే ఆకట్టుకునే పనితీరుతో పాటు మొత్తం రైడింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి జులు బైక్ లో అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో ఫ్రంట్ అండ్ రియర్ డిస్క్ బ్రేక్‌లు, అండర్ సీట్ స్టోరేజ్, LED డేటైమ్ రన్నింగ్ లైట్లు, డిజిటల్ స్పీడోమీటర్, ఫ్రంట్ స్టోరేజ్ స్పేస్, ఫ్రంట్ బ్యాగ్ హుక్, స్టైలిష్ గ్రాబ్ రైల్, ఆటో పవర్ కట్ ఛార్జర్, USB పోర్ట్ ఇంకా బూట్ లైట్ ఉన్నాయి. బ్యాటరీ, మోటార్ అండ్ కంట్రోలర్ వంటి కీలక భాగాలు IP67 రేటింగ్‌తో వాటర్ అండ్ డస్ట్ -రిసిస్టెంట్ పొందాయి. జులు KGట్రస్ట్‌తో 5 సంవత్సరాల ఎక్స్టెండెడ్ వారంటీని అందిస్తుంది. అదేవిధంగా కస్టమర్‌ లకు రోడ్‌సైడ్ అసిస్టెన్స్ ఇంకా సర్వీస్ సపోర్ట్‌ను కూడా అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మనకు పిక్సెల్ వైట్, ఇన్‌స్టా ఆరెంజ్, యూట్యూబ్ రెడ్, బ్లాక్ ఎక్స్, ఎఫ్‌బి బ్లూ అండ్ క్లౌడ్ గ్రే వంటి ఆరు రంగులలో లభించనుంది. మేడ్-ఇన్-ఇండియా ఫేమ్-2 కంప్లైంట్ హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆకర్షణీయమైన ప్రారంభ ధర రూ. 94,900 గా ఉంది.

  Last Updated: 13 Dec 2023, 06:06 PM IST