Piaggio: పియాజియో నుంచి సరికొత్త ఆటో.. మీరు ఓ లుక్కేయండి..!

పియాజియో (Piaggio) కంపెనీ అపే (Ape) క్లాసిక్‌ ఆటోను మార్కెట్ లోకి తెచ్చింది.

  • Written By:
  • Updated On - November 17, 2022 / 01:47 PM IST

పియాజియో (Piaggio) కంపెనీ అపే (Ape) క్లాసిక్‌ ఆటోను మార్కెట్ లోకి తెచ్చింది. 42 నెలల వారంటీ, 10 లీటర్ల ట్యాంక్ సామర్థ్యం, విశాలమైన డ్రైవర్‌ కాబిన్‌, లగేజి స్పేస్‌ దీని ప్రత్యేకతలు. దీని ఇంజన్ 435 సీసీ ఎయిర్‌ కూల్డ్‌ మెకానికల్‌ ఫుల్లీ అసిస్ట్‌ వ్యవస్థతో ఉంటుంది. దీని ప్రారంభ ధర రూ.2,88,722. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పియాజియో డీలర్లందరి వద్ద ఈ ఆటో అందుబాటులో ఉంటుంది. ఇటాలియన్ ఆటో దిగ్గజం పియాజియో వెహికల్స్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డిగో గ్రాఫీ బుధవారం Ape ఆటో క్లాసిక్‌ను విడుదల చేశారు. పియాజియో Apé శ్రేణి వాహనాల నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న మూడు చక్రాల వాహనాలలో ఇదొకటి అని ఆయన అన్నారు. పియాజియో రిటైల్ ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సాజు నాయర్ కూడా ఈ లాంచ్ లో పాల్గొన్నారు.

ఈ Apé ఆటో క్లాసిక్‌లో పుల్లీ అసిస్ట్ సిస్టమ్‌తో కూడిన 435cc ఎయిర్ కూల్డ్ మెకానికల్ డీజిల్ ఇంజన్ ఉంది. ఇది 10 లీటర్ల ఇంధన ట్యాంక్‌ను కలిగి ఉంది. మూడు చక్రాల వాహనం పుల్లీ అసిస్ట్ సిస్టమ్‌తో వస్తుంది. ఇది క్లిష్టమైన పరిస్థితులలో కూడా వాహనాన్ని ప్రారంభించడాన్ని సులభతరం చేస్తుంది. 42 నెలల సూపర్ వారంటీ, సులభమైన సర్వీసింగ్, సరసమైన విడిభాగాలతో అందుబాటులోకి వచ్చింది.