Site icon HashtagU Telugu

Passenger Vehicle Sales: గత నెలలో 3. 35 లక్షల వాహన అమ్మకాలు.. ఇదే అత్యధికం..!

Telangana Vehicles

Speed Limit Vehicles Hyderabad

ఫిబ్రవరిలో ప్యాసింజర్ వాహనాల హోల్‌సేల్ అమ్మకాలు (Passenger Vehicle Sales) వేగంగా పుంజుకున్నాయి. బలమైన డిమాండ్‌తో 3.35 లక్షల మార్కును దాటింది. అన్ని ప్రధాన వాహన తయారీదారులు ఏడాది ప్రాతిపదికన విక్రయాల్లో వృద్ధిని నమోదు చేసుకున్నారు. బలమైన డిమాండ్‌తో ఫిబ్రవరిలో ప్యాసింజర్ వాహనాల హోల్‌సేల్ విక్రయాలు 11 శాతం మార్కును దాటి 3.35 లక్షల యూనిట్లకు చేరుకున్నాయి. ఈ కాలంలో వాహనాల హోల్‌సేల్ అమ్మకాలలో ఇది రికార్డు సంఖ్య. ఏడాది క్రితంతో పోలిస్తే గత నెలలో మొత్తం వాహన విక్రయాలు 11 శాతం పెరిగి 3.35 లక్షల యూనిట్లను దాటాయి. ఫిబ్రవరి నెలలో వాహనాల హోల్‌సేల్‌ విక్రయాల్లో ఇదే రికార్డు. అయితే, కంపెనీ ఎగుమతులు ఫిబ్రవరి 2023లో 28 శాతం క్షీణించి 17,207 వాహనాలకు పరిమితమయ్యాయి. ఇది ఏడాది క్రితం 24,021 యూనిట్లుగా ఉంది.

దేశీయ మార్కెట్‌లో మారుతీ సుజుకీ ఇండియా హోల్‌సేల్ అమ్మకాలు 11% పెరిగి 1,55,114 యూనిట్లకు చేరుకున్నాయి. హ్యుందాయ్ హోల్‌సేల్ విక్రయాలు 9 శాతం పెరిగి 57,851 యూనిట్లకు చేరుకున్నాయి. దేశీయ మార్కెట్‌లో విక్రయాలు 7 శాతం పెరిగి 47,001 యూనిట్లకు చేరుకున్నాయి. టాటా మోటార్స్ మొత్తం హోల్‌సేల్ వాహనాల అమ్మకాలు 3 శాతం పెరిగి 79,705 యూనిట్లకు చేరుకున్నాయి. దేశీయ మార్కెట్లో కంపెనీ 78,006 వాహనాలను విక్రయించింది.

Also Read: 70 Basic Trainer Aircraft: రూ.6,828 కోట్ల వ్యయంతో 70 యుద్ధ విమానాలు కొనుగోలు

మారుతీ సుజుకీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్, సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఇప్పటివరకు 15.08 లక్షల వాహనాలను డెలివరీ చేసిందని, ఇది క్రితం సంవత్సరంతో పోలిస్తే 12.27 లక్షల వాహనాల నుండి 23 శాతం పెరిగిందని చెప్పారు. అయితే వాహన రుణాలపై వడ్డీ రేట్లు పెరగడం వల్ల కొత్త కార్ల డిమాండ్ స్వల్పంగా ప్రభావితమైందని ఆయన అంగీకరించారు. ఇది కాకుండా, సెమీకండక్టర్ల తక్కువ లభ్యత కారణంగా ఉత్పత్తి ఇప్పటికీ ప్రభావితమవుతోంది.

మరోవైపు.. కోల్ ఇండియా లిమిటెడ్ (CIL) బొగ్గు ఉత్పత్తి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-ఫిబ్రవరి కాలంలో 14.3 శాతం పెరిగి 619.7 మిలియన్ టన్నులకు చేరుకుంది. ఏడాది క్రితం ఇదే కాలంలో ఉత్పత్తి 542 మిలియన్ టన్నులుగా ఉంది. ప్రగతిశీల లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని 100 శాతం సాధించినట్టు కంపెనీ బుధవారం తెలిపింది. దేశీయ బొగ్గు ఉత్పత్తిలో కోల్ ఇండియా వాటా 80 శాతానికి పైగా ఉంది.

 

Exit mobile version