Ola: ఓలాకి మళ్లీ ఎదురుదెబ్బ..కొన్న ఆరు రోజులకే అలా అయిపోయిన స్కూటర్!

ప్రముఖ క్యాబ్ సర్వీసుల సంస్థ ఓలా గత ఏడాది ఓలా ఎస్ 1ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ ని మార్కెట్ లోకి విడుదల చేసిన

  • Written By:
  • Publish Date - October 13, 2022 / 06:10 PM IST

ప్రముఖ క్యాబ్ సర్వీసుల సంస్థ ఓలా గత ఏడాది ఓలా ఎస్ 1ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ ని మార్కెట్ లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక మార్కెట్లోకి విడుదల చేసిన తర్వాత ఈ ఓలా ఎస్ 1ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ కీ సంబంధించిన పలు సమస్యలు తలెత్తాయి. దీంతో ఓలా సంస్థ వెంటనే అప్రమత్తమై వాటిని బాగు చేసింది. అయితే ఇక ఓలా ఎస్ 1ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ కీ సంబంధించిన సమస్యలు తొలగిపోయాయి అనుకుంటుంటే తాజాగా జరిగిన ఒక సంఘటన వినియోగదారుల ఆలోచనలను పూర్తిగా తిప్పికొట్టింది.

తాజాగా సంజీవ్ జైన్ అనే ఒక వ్యక్తి ఓలా ఎస్ 1ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ ని కొనుగోలు చేశాడు. అయితే ఆ ఓలా ఎస్ 1ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ ని కొనుగోలు చేసిన ఆరు రోజుల్లోనే స్కూటర్ ఫ్రంట్ ఫోర్క్ విరిగిపోయింది అని తెలిపాడు. అంతేకాకుండా అందుకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అతను షేర్ చేసిన ఆ ఫోడులలో రెడ్ కలర్ ఓలా ఎస్ 1ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్రంట్ విరిగిపోయినది స్పష్టంగా కనిపిస్తోంది. అయితే స్కూటర్ స్టార్ట్ చేసిన కొద్దిసేపటికే ఆ విధంగా జరిగింది అని అతను తెలిపాడు.

ఇకపోతే ఇప్పటికే ఈ విధంగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ సమస్యలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఓలా సంస్థ అత్యధిక స్కూటర్లను విక్రయించడంలో విజయవంతం అవుతున్నప్పటికీ, ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లలో నాణ్యత విషయంపై ఇప్పటికే అనేక రకాల విమర్శలను ఎదుర్కొంది ఇప్పటికి ఎదుర్కొంటూనే ఉంది. కంపెనీ వీటిని పెద్ద లోపాలుగా పరిగణించకుండా ఇంకా సాఫ్ట్ వేర్ వైఫల్యాలు అని పేర్కొంది. అలాగే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లలో ప్యానెల్ గ్యాప్ లు, రబ్బర్ మ్యాట్ లు ఇలాంటి కొన్ని పరికరాలు క్వాలిటీ గురించి ఇప్పటికీ ప్రశ్నర్థకంగానే ఉంది.