Ola S1 X+ Electric Scooter: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ పై రూ.20 వేలు డిస్కౌంట్.. ఆఫర్ కొద్దిరోజులు మాత్రమే?

దేశవ్యాప్తంగా రోజురోజుకీ ఎలక్ట్రిక్ స్కూటర్ లకు ఉన్న డిమాండ్ క్రేజ్ విపరీతంగా పెరుగుతోంది. ఎలక్ట్రిక్ స్కూటర్ల వినియోగదారుల సంఖ్య పెరిగిపోతుం

  • Written By:
  • Publish Date - December 7, 2023 / 04:30 PM IST

దేశవ్యాప్తంగా రోజురోజుకీ ఎలక్ట్రిక్ స్కూటర్ లకు ఉన్న డిమాండ్ క్రేజ్ విపరీతంగా పెరుగుతోంది. ఎలక్ట్రిక్ స్కూటర్ల వినియోగదారుల సంఖ్య పెరిగిపోతుండడంతో అయ్యా కంపెనీలు కూడా అందుకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేయడంతో పాటు ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ లపై భారీగా డిస్కౌంట్ ధరలను ప్రకటిస్తున్నాయి. అందులో భాగంగానే తాజాగా కూడా ఓలా సంస్థ తన ఎలక్ట్రిక్ స్కూటర్ పై బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. ఓలా తన పోర్ట్ ఫోలియో లోని ఓలా ఎస్1 ఎక్స్ ప్లస్ స్కూటర్ ధరను దాదాపు రూ. 20,000 వరకూ తగ్గించింది. మరి ఎలక్ట్రిక్ స్కూటర్ అసలు ధర ఏమిటి? ఏ ఏ ఆఫర్లు లభిస్తున్నాయి అన్న వివరాల్లోకి వెళితే..

ప్రస్తుతం ఈ ఓలా ఎస్1 ఎక్స్ ప్లస్ ధర రూ. 1,09,999 ఎక్స్ షోరూంగా ఉంది. ఈ మోడల్ పై ఓలా ప్రత్యేక తగ్గింపు ధరను అందిస్తోంది. ఏకంగా రూ. 20,000 వరకూ తగ్గింపు ఈ స్కూటర్ ను అందిస్తోంది. భారీ డిస్కౌంట్ ధరతో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ను కేవలం రూ. 89,999 కి కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ ఆఫర్ కేవలం డిసెంబర్ చివరి వరకూ మాత్రమే ఉంటుందని ఓలా కంపెనీ ప్రకటించింది. రానున్న కాలంలో అదనపు బెనిఫిట్స్ కూడా ఉంటాయని కంపెనీ తెలిపింది. కొత్త ఏడాదిలో మళ్లీ ధరలు పెరిగే అవకాశం ఉంటుందని వివరించింది. ఇకపోతే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. ఓలా ఎస్ 1 ఎక్స్ ప్లస్ స్కూటర్లో 3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉంటుంది.

దీంతో సింగిల్ చార్జ్ పై 151 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. 500వాట్ల చార్జర్ ను ఇది అందిస్తుంది. దీని సాయంతో 7.4 గంటల్లోనే పూర్తిగా బ్యాటరీని చార్జ్ చేయొచ్చు. ఇక మోటార్ విషయానికి వస్తే దీనిలో హబ్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఈ స్కూటర్ గరిష్టంగా గంటకు 90కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలుగుతుంది. కేవలం 3.3 సెకండ్లలోనే సున్నా నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. 5.5 సెకండ్లలోనే సున్నా నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. దీనలో ఎకో మోడ, నార్మల్ మోడ్, స్పోర్ట్ మోడ్ వంటివి ఉంటాయి. ఈ కొత్త ఓలా ఎస్1 ఎక్స్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఐదు అంగుళాల ఎల్సీడీ డిస్ ప్లే ఉంటుంది. ఎల్ఈడీ లైటింగ్, సైడ్ స్టాండ్ అలర్ట్, రివర్స్ మోడ్, రిమోట్ బూత్ అన్ క్లాక్, నేవిగేషన్ వంటివి ఉంటాయి. బ్లూటూత్, జీపీఎస్ కనెక్టివీటీతో ఈ స్కూటర్ వస్తుంది.