Ola S1 Air: బడ్జెట్ ధరలోనే ఓలా ఎస్1 ఎయిర్ ఎలక్ట్రిక్ బైక్.. ధర, ఫీచర్స్ ఇవే?

ప్రముఖ క్యాబ్ సర్వీసుల సంస్థ ఓలా ఇప్పటికే ఎన్నో రకాల ఎలక్ట్రిక్ బైక్ లను మార్కెట్ లోకి విడుదల చేసిన విషయం

  • Written By:
  • Publish Date - October 24, 2022 / 06:45 PM IST

ప్రముఖ క్యాబ్ సర్వీసుల సంస్థ ఓలా ఇప్పటికే ఎన్నో రకాల ఎలక్ట్రిక్ బైక్ లను మార్కెట్ లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ వోల సంస్థ భారత్లో ఎలక్ట్రిక్ స్కూటర్లను అమ్మకాలను ప్రారంభించిన అది కొద్దిగా కాలంలోనే దేశపు అగ్రగామి ఎలక్ట్రిక్ టూవీలర్ బ్యాండ్ గా అవతరించిన విషయం తెలిసిందే. ఎలక్ట్రిక్ బైక్ రంగంలోనే సరికొత్త సంచలనలు సృష్టిస్తోంది ఓలా సంస్థ. ఇకపోతే తాజాగా ఓలా సంస్థ మరొక బాంబు పేలిచింది. అదేమిటంటే దిగజా ఆటోమొబైల్ కంపెనీలకు గట్టిగా పోటీ ఇవ్వడానికి అత్యంత తక్కువ ధరికే కొత్త మోడల్ ని రిలీజ్ చేసింది. ఓలా సంస్థ గత ఏడాది ఓలా ఎస్1 ప్రో విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఇప్పుడు ఓలా ఎస్1ఎయిర్ పేరుతో మరొక కొత్త మోడల్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే ఈ ఓలా ఎస్1 ఎయిర్ కంటె ముందుగా ఓలా ఎస్1 ప్రో ని మార్కెట్లోకి తీసుకురాగా అవి మొదట్లో బాగా అమ్ముడు అయ్యాయి. కానీ అవి రాను రాను విక్రయాలు తగ్గిపోవడంతో ఎస్1 స్కూటర్ ని తక్కువ ధరకే అనగా రూ.99 వేల కే స్కూటర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ధర తగ్గించడం వల్ల విక్రయాలు పెరుగుతాయని ఓలా సంస్థ భావించి అప్పటికి అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో బడ్జెట్ ధరలోనే తాజాగా ఓలా ఎస్1 ఎయిర్ ని మార్కెట్లోకి విడుదల చేసింది. తాజాగా విడుదల చేసిన ఈ బైక్ కి,ఓలా ఎస్1 ప్రో కి పెద్దగా మార్పులు ఏమీ లేవు. ఇది పాత మోడల్ ను పోలి ఉంది సాఫ్ట్ వేర్ కూడా ఒకటే.

ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ 2.5 కిలో వాట్ హవర్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 101 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ ఓలా ఎస్1 ఎయిర్ టీచర్స్ విషయానికి వస్తే.. ఏడు అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 2.2 గిగా హెర్జ్,8 కోర్ ప్రాసెసర్, 3జీబీ ర్యామ్,మ్యూజిక్ ప్లే బ్యాక్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. దీని ధర విషయానికి వస్తే మొదట రూ.999 చెల్లించి కస్టమర్లు కొత్త స్కూటర్ ని బుక్ చేసుకోవచ్చని 2023 ఫిబ్రవరి నుంచి కొత్త మోడల్ కొనుగోలు ప్రారంభం కాగా ఏప్రిల్ నుంచి డెలివరీ చేయనున్నట్లు సంస్థ తెలిపింది. కాగా మొదట దీని ధర రూ.79,999 గా కేటాయించినట్లు ఓలా సంస్థ తెలిపింది. ఆ తర్వాత దానిని 85 వేల వరకు పెంచనున్నట్టు తెలిపింది.