Site icon HashtagU Telugu

Ola: ఓలా స్కూటర్ పై కళ్ళు చెదిరే ఆఫర్స్.. ఏకంగా అన్ని వేల రూ. తగ్గింపు?

Mixcollage 17 Dec 2023 01 51 Pm 7336

Mixcollage 17 Dec 2023 01 51 Pm 7336

ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ ఓలా ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఒకవైపు కొత్త కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే మరొకవైపు ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేస్తున్న స్కూటర్ల పై భారీగా డిస్కౌంట్ ధరలను ప్రకటిస్తూ వినియోగదారుల దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓలా సంస్థ ఎలక్ట్రానిక్ స్కూటర్ పై కళ్ళు చెదిరే ఆఫర్స్ ని ప్రకటించింది. మరి ఆ వివరాల్లోకి వెళితే.. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ డిసెంబర్ టు రిమెంబర్ పేరుతో తన సరికొత్త ఎస్1 X+ ఎలక్ట్రిక్ స్కూటర్‌ పై రూ.20వేల డిస్కౌంట్ ప్రకటించింది. తగ్గింపు తర్వాత ఈ స్కూటర్ రూ.89,999కే సొంతం చేసుకోవచ్చు.

అయితే ఈ స్కూటర్ డెలివరీలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ స్కూటర్‌కి ఇప్పటికే ఇండియాలో మంచి డిమాండ్ ఉంది. ఓలా డిసెంబర్ టు రిమెంబర్ ప్రచారాన్ని డిసెంబర్ 3న ప్రారంభించింది. ఇందులో భాగంగా తన స్కూటర్లపై ఆఫర్లు, డిస్కౌంట్ లను ప్రకటిస్తోంది. కాగా ఈ స్కూటర్‌కి 3KWH బ్యాటరీ ఉంది. ఈ స్కూటర్ బ్యాటరీని ఒకసారి ఛార్జ్ చేస్తే చాలు 151 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 90 కిలోమీటర్లుగా కంపెనీ తెలిపింది. ఈ స్కూటర్ 3.3 సెకండ్లలో 0 నుంచి గంటకు 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. దీనికి మల్టీ టోన్ డిజైన్ ఇచ్చారు. కాగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మనకు 3 రంగుల్లో లభిస్తుంది.

ఈ స్కూటర్‌కి 34 లీటర్ల బూట్ స్పేస్ ఉంది. ఇందులో హెల్మెట్ సహా సామాన్లు పెట్టుకోవచ్చని తెలిపారు. ఈ స్కూటర్‌లో 3.5 అంగుళాల డిస్‌ప్లే ఉంది. ఫిజికల్ కీ కూడా ఉంది. ఈ స్కూటర్‌ని రివర్సులో నడిపేందుకు కూడా వీలు ఉంది. అలాగే రైడ్ చేస్తున్నప్పుడు ఎవరు కాల్ చేస్తున్నారో తెలుసుకోవచ్చు. ఈ స్కూటర్‌లో ఎకో, నార్మల్, స్పోర్ట్స్ అనే మూడు స్పీడ్స్ ఉన్నాయి. ఎకో మోడ్‌లో ఈ స్కూటర్ 125 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. నార్మల్ మోడ్‌లో 100 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. దీనికి హబ్ మోటర్ వాడారు. పీక్ పవర్ 6Kwగా ఉంది. దీని ఫ్రంట్, బ్యాక్ టైర్లకు డ్రమ్ బ్రేక్ ఉంది. అలాగే ఈ స్కూటర్‌ బ్యాటరీని ఫుల్లుగా ఛార్జ్ చెయ్యడానికి 5 గంటలు పడుతుంది. S1 X + స్కూటర్‌కి హెడ్ ల్యాంప్స్, టైల్ ల్యాంప్స్‌ని LEDతో సెచ్ చేశారు. ఈ స్కూటీకి బ్లూటూత్, జీపీఎస్ కనెక్టివిటీ ఉంది. రిమోట్ బూట్ అన్ లాక్ ఉంది. కానీ క్రూయిజ్ కంట్రోల్ లేదు.

Exit mobile version