ప్రస్తుత రోజుల్లో రోజురోజుకీ భారత దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుండడంతో ఆయా సంస్థలు కూడా అందుకు అనుగుణంగానే ఎక్కువ మొత్తంలో మంచి మంచి ఫీచర్లు కలిగిన ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోతుండడంతో ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఇకపోతే ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులు ఎక్కువ శాతం మంది ఇష్టపడే బ్రాండ్లలో ఓలా కూడా ఒకటి. ఇప్పటివరకు స్కూటర్లను విడుదల చేసిన ఓలా సంస్థ ఇప్పుడు మొట్టమొదటిసారి మార్కెట్లోకి మొదటి ఎలక్ట్రిక్ బైక్ ని తీసుకురాబోతోంది.
ఈ మేరకు ఆ కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్ ఇటీవల సోషల్ మీడియాలో ఒక చిత్రాన్ని షేర్ చేయడంతో ఆ ఫొటో వైరల్‌గా మారింది. మరి ఈ కొత్త స్కూటర్ కి సంబంధించిన మరిన్ని వివరాల్లోకి వెళితే.. కాగా గత ఏడాది ఆగస్టు 15న ఓలా ఎలక్ట్రిక్ నాలుగు ఫ్యూచరిస్టిక్ ఈవీ మోటార్ సైకిల్ కాన్సెప్ట్ లను ఆవిష్కరించిన విషయం తెలిసిందే..ఈ డిజైన్‌లు అప్పట్లో ఈవీ ప్రియులను బాగా ఆకట్టకున్నాయి. అయితే అప్పడు డిస్‌ప్లే చేసిన డిజైన్‌లకు సంబంధం లేకుండా మరింత కొత్తగా ఈవీ బైక్‌ను ఓలా లాంచ్ చేస్తున్నట్లు ఆ చిత్రాలను చూస్తుంటే అర్థం అవుతుంది. ఓలా కంపెనీ ఇటీవల మూడు కొత్త ఈ-బైక్ డిజైన్‌లను పేటెంట్ చేసింది.
కాగా త్వరలో రాబోతున్న ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ అల్ట్రావయోలెట్ ఎఫ్ 77 మ్యాక్ 2, మేటర్ ఎరా వంటి మోడళ్లతో పోటీ పడనుంది. ఓలా ఈవీ బైక్ లాంచ్ చేస్తే భారతదేశ ఆటోమొబైల్ రంగంలో తన ప్రత్యేకతను చాటుకుందట. అయితే ఇప్పటికే ఓలా లాంచ్ చేసిన ఎస్ 1 ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాల్లో ముందు వరుసలో ఉంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్ ను ఆగస్టు 15 విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.