Site icon HashtagU Telugu

Ola Scooter: అమ్మకాల్లో తగ్గేదెలే అంటున్న ఓలా.. ఆ ఆఫర్ కొద్దిరోజుల మాత్రమే?

Ola Scooter

Ola Scooter

దేశవ్యాప్తంగా రోజురోజుకీ ఇంజన్ ధరలు ఆకాశాన్నంటుతుండడంతో వాహన వినియోగదారులు ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే చాలామంది ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలలో మరి ముఖ్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్ ల వినియోగం అయితే మరింత పెరిగిపోతోంది. కాగా భారతదేశపు అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల విడుదల చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా అమ్మకాల విషయంలో ఓలా దూసుకుపోతోంది. జూలై నెలలో ఆకట్టుకునే అమ్మకాలను సాధించి ఈవీ 2W మార్కెట్‌లో తన బలమైన స్థానాన్ని కొనసాగిస్తోంది.

కంపెనీ జూలైలో దాదాపు 19,000 యూనిట్లను విక్రయించి 40% వాటాతో మార్కెట్ లీడర్‌గా తన స్థానాన్ని పటిష్టం చేసుకుంది. ఓలా గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే అమ్మకాలలో 375% Y-o-Y వృద్ధిని సాధించింది. ఓలా ఎలక్ట్రిక్ మార్కెట్ లీడర్‌గా స్థానాన్ని నిలబెట్టుకుందని, #EndICEAge నినాదాన్ని నిజం చేసేందుకు నిబద్ధతతో ఉందని. విప్లవాత్మకమైన ఎస్1ఎయిర్‌కు అద్భుతమైన స్పందన లభిస్తున్నందున, ఈ సరికొత్త ప్రోడక్ట్ స్కూటర్ సెగ్మెంట్‌లో ఈవీ మాస్ మార్కెట్‌ అడాప్షన్‌ను ఊపందుకునేలా చేస్తుందని ఓలా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అంకుష్ అగర్వాల్ తెలిపారు.
తద్వారా భారతదేశం ఈవీ వ్యాప్తిని వేగవంతం చేయడానికి ఓలా ఎంతో తోడ్పడుతుందని, అత్యంత అందుబాటు ధరలో వస్తున్న ఎస్1ఎయిర్ ICE స్కూటర్‌లకు సరైన సమాధానం, దాని అతి తక్కువ TCO తో ఇది #EndICEAgeని మరింత వేగవంతం చేస్తుందని, ఆగస్ట్‌లో ఎస్1 ఎయిర్ డెలివరీల గురించి, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఓలా వార్షిక ఫ్లాగ్‌షిప్ ఈవెంట్ జరుగుతుండడంతో మేము సంతోషిస్తున్నామని అన్నారు.

ఇక ఓలా ఎస్1 ఎయిర్ కస్టమర్ల నుండి మంచి స్పందనను పొందింది. 50,000 వేల కంటే ఎక్కువ బుకింగ్‌లను నమోదు చేసుకుంది. అధిక డిమాండ్, దాని ప్రారంభ ధరలో స్కూటర్ లభ్యతను పొడిగించమని అనేక అభ్యర్థనల మేరకు, కంపెనీ కస్టమర్లందరికీ రూ.1,09,999 ఆకర్షణీయమైన ప్రారంభ ధరకే కొనుగోలు చేసే అవకాశాన్ని ఆగస్టు 15 వరకు పొడిగించింది. తక్కువ రన్నింగ్, మెయింటెనెన్స్ ఖర్చుతో, ఎస్1, ఎస్1 ప్రో నుండి సంక్రమించిన అత్యాధునిక సాంకేతికత, డిజైన్ అంశాలను ఎస్1 ఎయిర్ అందిస్తుంది, అదే సమయంలో నమ్మశక్యం కాని ధరతో అందుబాటులోకి వస్తుంది. బలమైన 3 kWh బ్యాటరీ కెపాసిటీ, 125 కిమీ సర్టిఫైడ్ రేంజ్, 90 గంటకు కిమీ యొక్క చెప్పుకోదగిన టాప్ స్పీడ్‌తో, ఓలా ఎస్1 ఎయిర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలో కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేస్తుంది. ఆగస్టు 15 లోగా ఓలా ఎస్1 ఎయిర్ బుక్ చేసేవారు రూ.1,09,999 ధరకే ఈ టూవీలర్ సొంతం చేసుకోవచ్చు. ఆ తర్వాత ధర రూ.1,19,999 కి పెరుగుతుంది. ఆగస్టులోనే డెలివరీలు ప్రారంభం కానున్నాయి.