Site icon HashtagU Telugu

Ola Electric Scooters Discount: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ పై అదిరిపోయే డిస్కౌంట్.. ఈ ఆఫర్ అప్పటివరకు మాత్రమే!

Ola Electric Scooters Discount

Ola Electric Scooters Discount

వినాయక చవితి వచ్చేసింది. దీంతో గత కొద్ది రోజులుగా వాహనాలపై మొబైల్ ఫోన్స్ పై అలాగే పలు ప్రోడక్ట్ లపై భారీగా డిస్కౌంట్ లను అందిస్తూ వినియోగదారులను ఆకర్షిస్తున్నారు. అందులో భాగంగానే గణేష్ చతుర్థిని పురస్కరించుకుని ఓలా ఎలక్ట్రిక్ సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు ఆఫర్ ప్రకటించింది. ఓలా ఎస్ 1 ప్రో, ఎస్ 1 ఎక్స్, ఎస్ 1 ఎక్స్ ప్లస్ మోడళ్లపై రూ .5,000 తగ్గింపును అందిస్తోంది. అలాగే ఎంపిక చేసిన రాష్ట్రాల్లో ఎక్స్ఛేంజ్ బోనస్‌ లు, బ్యాంక్ డిస్కౌంట్లు సెప్టెంబర్ 30 వరకు చెల్లుబాటు అవుతాయి. ధర తగ్గింపుతో పాటు కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఈ నెలలో ఓలా అందిస్తున్న బ్యాంక్ ఆఫర్లు, ప్రయోజనాలకు అదనంగా ఉంటాయి.

సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఈ ఫెస్టివల్ డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది. అయితే పండుగ సందర్భంగా ఈ ఆఫర్ ను మరిన్ని రోజులు పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ డిస్కౌంట్లు కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయని గమనించడం ముఖ్యం. ఇకపోతే డిస్కౌంట్ వివరాల విషయానికొస్తే..ఓలా ఎలక్ట్రిక్ ఓలా ఎస్ 1 ప్రోపై రూ .5,000 ముందస్తు తగ్గింపును అందిస్తోంది. ఎస్ 1 ఎక్స్ ఎస్ 1 ఎక్స్ ప్లస్ మోడళ్లపై రూ .5,000 తగ్గింపును ఇస్తోంది. దీంతో స్కూటర్ల ధరలు రూ.96,999, రూ.89,999 కు తగ్గాయి. అలాగే పాత ద్విచక్ర వాహనాన్ని కొత్త ఎస్ 1 ప్రోతో మార్చడంపై రూ .12,000 ఎక్స్ఛేంజ్ బోనస్ పొందవచ్చు. ఎస్ 1 ఎక్స్ పై రూ .8,000 బోనస్ కూడా లభిస్తుంది. ఎక్స్ఛేంజ్ విలువలో 30 శాతం వరకు లేదా సంబంధిత బోనస్ మొత్తాన్ని అందిస్తామని ఓలా తెలిపింది.

అంతేకాకుండా బైక్ మేకర్ యాక్సెసరీస్ పై 25శాతం తగ్గింపును అందిస్తోంది. అదేవిధంగా ఓలా స్కూటర్లపై బ్యాంక్ ఆఫర్లు కూడా వర్తిస్తాయి. ఆర్బీఎల్, యస్ బ్యాంక్, ఐడీఎఫ్సీ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, వన్‌కార్డ్ క్రెడిట్ కార్డు ఈఎంఐని ఎంచుకుంటే రూ.5,000 వరకు 5 శాతం డిస్కౌంట్‌ ను అందిస్తున్నాయి. ఈ ఆఫర్ పరిమిత కాలంతో ఉంది. అర్హత కలిగిన కస్టమర్లకు జీరో డౌన్ పేమెంట్ ఆప్షన్, 6.99 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఈ బ్యాంక్ ఆఫర్లన్నీ సెప్టెంబర్ 30 వరకు అందుబాటులో ఉంటాయి.

ఇకపోతే ఏఏ రాష్ట్రాలలో ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి అన్న విషయానికి వస్తే…కర్ణాటక, గుజరాత్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ, చత్తీస్ గఢ్, బెంగళూరు, మాలేగావ్, మైసూర్, నాందేడ్, బెల్‌గావి, పర్భానీ, కల్యాణ్, బీదర్, ఔరంగాబాద్-ఎంహెచ్, ముంబై, నాగ్ పూర్, నాసిక్, ఢిల్లీ ఎన్ సీఆర్, జైపూర్, గ్వాలియర్, మెహ్సానా, బరేలీ, తిరుపతి, దుర్గ్, పాట్నా, సాహిబ్ జాదా, కోల్‌కతా, సివాన్, ఉదయ్ పూర్-ఆర్జే, ఉన్నావ్, మొరాదాబాద్, మీరట్ వంటి ప్రదేశాలలో ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. మరింత సమాచారం కోసం దగ్గరలో ఉన్న షో రూమ్ లను సంప్రదించండి.