Site icon HashtagU Telugu

Ola Electric Sales January: జనవరిలో అదరగొట్టిన ఓలా ఎలక్ట్రిక్.. 40శాతం వాటాతో ఆధిపత్యం?

Mixcollage 02 Feb 2024 03 14 Pm 3999

Mixcollage 02 Feb 2024 03 14 Pm 3999

ప్రస్తుతం భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు ఫుల్ డిమాండ్ విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం వాహన వినియోగదారులు డీజిల్ పెట్రోల్ తో నడిచే ఇంజన్ వాహనాలకు బదులుగా ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. ఈవీ మార్కెట్లో వినియోగదారులను ఆకర్షించేందుకు ఓలా ఎలక్ట్రిక్ సరికొత్త ఈవీ స్కూటర్లను ప్రవేశపెడుతోంది. ఇదివరకే అనేక మోడల్స్ ఓలా ఈవీ స్కూటర్లు మార్కెట్లోకి రిలీజ్ చేసింది. ఈ క్రమంలో ఓలా భారీ విక్రయాలతో దూసుకుపోతుంది. ఈ జనవరి 2024లో ఓలా ఎలక్ట్రిక్ 31వేల రిజిస్ట్రేషన్‌లను నమోదు చేసింది.

తద్వారా టూ వీలర్ ఎలక్ట్రిక్‌ విభాగంలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ మార్కెట్ వాటాను 40శాతం కొనసాగించిందని కంపెనీ వెల్లడించింది. దాంతో ఈ జనవరిలో అత్యధిక నెలవారీ రిజిస్ట్రేషన్‌లను నమోదు చేసింది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 70శాతానికి పైగా వృద్ధిని సాధించింది. గత ఏడాది డిసెంబరులో ఒకే నెలలో 30వేల రిజిస్ట్రేషన్‌లను నమోదు చేసిన ఫస్ట్ ఎలక్ట్రిక్‌ ఈవీ వెహికల్ తయారీదారుగా ఓలా ఎలక్ట్రిక్ నిలిచింది. ఇప్పుడు ఈ నెలలో భారీ విక్రయాలతో దూసుకుపోయింది. ఓలా ఎలక్ట్రిక్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అన్షుల్ ఖండేల్వాల్ ప్రకారం.. ఈ జనవరిలో ఓలా రిజిస్ట్రేషన్లు ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయని ఆయన అన్నారు. 2024 ఏడాదిలో ఈ రికార్డు అసాధారణమైనది పేర్కొన్నారు.

ఓలా ఎస్1 ప్రో, ఎస్1 ఎయిర్, ఎస్1 ఎక్స్ ప్లస్‌తో బలమైన ఉత్పత్తి లైనప్ కలిగి ఉందన్నారు. ఓలా ఎలక్ట్రిక్ తమ స్కూటర్ పోర్ట్‌ఫోలియోను 5 బెస్ట్ కేటగిరి ప్రొడక్టులకు విస్తరించిన సంగతి తెలిసిందే. ఓలా ఎస్1 ప్రో మోడల్ రూ. 1,47,499 ఉండగా.. ఫ్లాగ్‌షిప్ స్కూటర్ ఓలా ఎస్1 ఎయిర్ రూ. 1,19,999 వద్ద మార్కెట్లో విక్రయానికి అందుబాటులో ఉంది. అదనంగా ఐసీఈ-కిల్లర్ ప్రొడక్టు S1Xని మొత్తం 3 వేరియంట్‌లలో ప్రవేశపెట్టిందని ఆయన తెలిపారు. విభిన్న ప్రాధాన్యతలతో రైడర్‌ల అవసరాలను తీర్చడానికి ఎస్1 ఎక్స్ ప్లస్, ఎస్1X,ఎస్1X మోడల్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.
ఎస్1 ఎక్స్ ప్లస్ ప్రస్తుతం రూ.1,09,999 ధరకు విక్రయిస్తుండగా.. రూ. 20వేల ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్‌ అందిస్తోంది. ఓలా ఎస్1ఎక్స్, ఎస్1ఎక్స్ కోసం రిజర్వేషన్ విండో రూ. 999 వద్ద మాత్రమే బుకింగ్ చేసుకునే వీలుంది. అంటే వరుసగా రూ. 89,999 నుంచి రూ. 99,999 ప్రారంభ ధరకు కొనుగోలు చేయొచ్చు.