ప్రముఖ మోటార్ సైకిల్ తయారీ సంస్థ ఓలా త్వరలోనే వినియోగదారులకు ఒక చక్కటి శుభవార్తను తెలపనుంది. అదేమిటంటే ఇప్పటివరకు అనేక రకాల ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లోకి విడుదల చేసిన ఓలా సంస్థ మొదటిసారిగా అద్భుతమైన ఫీచర్స్ తో ఒక శక్తివంతమైన బైక్ ను మార్కెట్ లోకి విడుదల చేయబోతోందట. అయితే ఇప్పటికే ఓలా కంపెనీ సెబీకి ఈ స్మార్ట్ బైక్‌కి సంబంధించిన పత్రాలను సమర్పించినట్లు తెలుస్తోంది. దీనిని కంపెనీ అందుబాటులోకి తీసుకు వస్తే, దాదాపు 2026 సంవత్సరంలో మొదటి నెలలో అందుబాటులోకి తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ మోటర్ సైకిల్‌కి సంబంధించిన ఫీచర్స్ , స్పెషిఫికేషన్స్ వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కాగా ఓలా కంపెనీ ఇప్పటివరకు కంపెనీ నాలుగు విభిన్న మోడల్స్ కాన్సెప్ట్ లను పరిచేయం విషయం తెలిసిందే. అయితే ఈ మోడల్స్ సంబంధించిన విక్రయాలను ఓలా అధికారిక వెబ్‌సైల్‌లో అందుబాటులో ఉంచబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటుగా త్వరలోనే ఫ్రీ బుకింగ్ ప్రక్రియను అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఈ నాలుగు కాన్సెప్ట్‌కి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. దీనిని ఓలా డైమండ్‌హెడ్, రోడ్‌స్టర్, అడ్వెంచర్‌తో పాటు క్రూయిజర్‌ల పేర్లలతో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.
అయితే వీటిని 2024 చివరి లేదా మొదటి నెలలో లాంచ్ చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. మరి త్వరలో లాంచ్ కాబోయే ఓలా మోటర్ సైకిల్ కి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఇది అద్భుతమైన ఫీచర్స్ తో అందుబాటులోకి రానుంది. కంపెనీ ఈ నాలుగు బైక్‌లకు సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఈ బైక్‌కి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అద్భుతమైన బ్లాక్ కలర్ లో ముందుగా అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు ప్రీమియం లుక్ లో కనిపించేందుకు ఈ స్మార్ట్ బైక్ అద్భుతమైన డిజైన్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ మోటర్ సైకిల్ చూడడానికి అచ్చం స్పోర్ట్స్ లుక్‌లో కనిపిస్తుందట. ఇక ఈ స్కూటర్ స్పెషిఫికేషన్స్‌ను కంపెనీ వచ్చే ఏడాదిలో ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.