Ola Scooter 79999 : రూ.80వేలకే ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్.. వచ్చే నెల నుంచి డెలివరీలు

Ola Scooter 79999 : ఓలా ఎలక్ట్రిక్‌ (Ola electric) సంస్థ  కొత్త ఈ-స్కూటర్లను మార్కెట్లోకి రిలీజ్ చేసింది. ఓలా ఎస్‌ 1 ఎక్స్‌ (ola S1X) పేరిట 3 వేరియంట్లను తీసుకొచ్చింది.

  • Written By:
  • Publish Date - August 15, 2023 / 06:41 PM IST

Ola Scooter 79999 : ఓలా ఎలక్ట్రిక్‌ (Ola electric) సంస్థ  కొత్త ఈ-స్కూటర్లను మార్కెట్లోకి రిలీజ్ చేసింది. ఓలా ఎస్‌ 1 ఎక్స్‌ (ola S1X) పేరిట 3 వేరియంట్లను తీసుకొచ్చింది. ఆగస్టు 15 సందర్భంగా ‘కస్టమర్‌ డే’ పేరిట నిర్వహించిన ఈవెంట్‌లో వీటిని లాంచ్‌ చేసింది. ఎస్‌1 ఎక్స్‌ (ola S1X) (2kWh), ఎస్‌1 ఎక్స్‌ (ola S1X) (3kWh), ఎస్‌ 1 ఎక్స్‌+ (ola S1 X+) అనే పేర్లు కలిగిన ఈ-స్కూటర్ల మోడళ్లను రూ.లక్షలోపు ధరకే తీసుకురావడం గమనార్హం.

Also read : Bindeshwar Pathak : “సులభ్” విప్లవ యోధుడు బిందేశ్వర్ పాఠక్ ఇక లేరు

ఎస్‌ 1 ఎక్స్‌ (2 కిలోవాట్‌ బ్యాటరీ) మోడల్‌ ధర  రూ.89,999 కాగా.. ఆగస్టు 21 వరకు రూ.79,999కే (Ola Scooter 79999) విక్రయించనున్నారు.  ఓలా ఎక్స్‌ 1+ స్కూటర్‌ ధర రూ.1.09 లక్షలు కాగా.. ఆగస్టు 21 వరకు రూ.99,999కే సేల్ చేస్తారు. ఎస్‌1 ప్రో సెకండ్‌ జనరేషన్‌ మోడల్‌ ధర రూ.1.47 లక్షలు కాగా.. ఆగస్టు 21 వరకు ఎస్‌ 1 ఎయిర్‌ రూ.1.19 లక్షలకే విక్రయిస్తారు. ఎక్స్ షోరూమ్ ధరకు అదనంగా రిజిస్ట్రేషన్ చార్జీలు ఉంటాయి. వీటి డెలివరీలు సెప్టెంబర్ నుంచే మొదలవుతాయి. కాగా,  ఎస్‌ 1 ప్రో (ola S1 Pro) సెకండ్‌ జనరేషన్‌ స్కూటర్ ను కూడా ఓలా ఆవిష్కరించింది.  దీని టాప్‌ స్పీడ్‌ గంటకు 120 కిలోమీటర్లు. కేవలం 2.6 సెకన్లలోనే 40 కి.మీ. వేగాన్ని అందుకుంటుందని ఓలా తెలిపింది.

Also read : Rejected 13 Job Offers : ఆమె 13 జాబ్ ఆఫర్స్ కు నో చెప్పింది.. ఆ తర్వాత ఏమైందంటే ?