Site icon HashtagU Telugu

Ola Electric: మార్కెట్లోకి విడుదలైన ఓలా సరికొత్త స్కూటర్.. ఫీచర్స్ మామూలుగా లేవుగా?

Mixcollage 04 Feb 2024 03 11 Pm 8909

Mixcollage 04 Feb 2024 03 11 Pm 8909

ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ ఓలా ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఒకవైపు కొత్త కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే మరొకవైపు ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేస్తున్న స్కూటర్ల పై భారీగా డిస్కౌంట్ ధరలను ప్రకటిస్తూ వినియోగదారుల దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓలా సంస్థ మార్కెట్లోకి మరోసారి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ని విడుదల చేయబోతోంది. మరి ఆ వివరాల్లోకి వెళితే.. ఓలా ఎస్‌1ఎక్స్‌ 4కేడబ్ల్యూహెచ్‌ పేరిట కొత్త స్కూటర్‌ను లాంచ్‌ చేసింది. ఇది సింగిల్‌ చార్జ్‌ పై 190కిలోమీటర్ల పరిధిని ఇస్తుందని కంపెనీ ప్రకటించింది.

ఓలా ఎస్‌1ఎక్స్‌ లైనప్‌లోనే అత్యధిక సామర్థ్య కలిగిన బ్యాటరీ 4కేడబ్ల్యూహెచ్‌ కావడం విశేషం. దీని ప్రారంభ ధరను రూ. 1.99లక్షలు అని ఓలా ప్రకటించింది. మరి ఈ సరికొత్త స్కూటర్ కి సంబంధించిన మరిన్ని వివరాల్లోకి వెళితే.. కొత్త లాంచ్‌ చేసిన ఓలా ఎస్‌1ఎక్స్‌ 4కేడబ్ల్యూహెచ్‌ స్కూటర్‌ ఇప్పటికే ఉన్న ఎస్‌1ఎక్స్‌ 3కేడబ్ల్యూహెచ్‌ మాదిరిగానే ఉంటుంది. పూర్తి మెకానిజం అంతా దానిలాగేనే ఉంటుంది. మారేదల్లా బ్యాటరీ శక్తితోపాటు రేంజ్‌ మాత్రమే. ఈ స్కూటర్‌ 3కేడబ్ల్యూహెచ్‌ వేరియంట్‌ మాదిరిగానే 3.3 సెకండ్లలోనే సున్నా నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

ఇది గరిష్టంగా 90 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలుగుతుంది. దీనిలో 6కేడబ్ల్యూ సామర్థ్యంతో ఉండే మోటార్‌ 8బీహెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటర్లో ఎకో, నార్మల్‌, స్పోర్ట్స్‌ వంటి మూడు రైడింగ్‌ మోడ్లు ఉంటాయి. ఓలా ఎస్‌1ఎక్స్‌ 4కేడబ్ల్యూహెచ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ డెలివరీలు ఏప్రిల్‌ నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ ప్రకటించింది. దీనికి సంబంధించిన ప్రీ బుకింగ్స్‌ కూడా ప్రారంభమయ్యాయి. దీని ధర రూ. 1.99లక్షలుగా ఉంది. అదే సమయంలో ఎస్‌1ఎక్స్‌ 2కేడబ్ల్యూహెచ్‌ ధర రూ. 79,999కాగా.. ఓలా ఎస్‌1 ఎక్స్‌ 3కేడబ్ల్యూహెచ్‌ వేరియంట్‌ ధర రూ. 89,999గా ఉంది.

Exit mobile version