Site icon HashtagU Telugu

Ola Bike: రేసర్ కాన్సెప్ట్ తో మార్కెట్ లోకి విడుదల కాబోతున్న ఓలా బైక్స్.. ఎప్పుడో తెలుసా?

Mixcollage 23 Jun 2024 02 07 Pm 9608

Mixcollage 23 Jun 2024 02 07 Pm 9608

ప్రస్తుతం దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈవీ వాహనాల హవా నడుస్తోంది. ముఖ్యంగా ఈవీ స్కూటర్లు అత్యధిక స్థాయిలో అమ్ముడవుతున్నాయి. స్కూటర్ల సంగతి అటు ఉంచితే టాప్ కంపెనీలు ఈవీ బైక్స్ ను రిలీజ్ చేయకపోవడంతో వినియోగదారులు కూడా ఈవీ బైక్స్ ను కొనుగోలు విషయంలో వెనుకడుగు వేస్తున్నారు. అయితే తాజాగా 52 శాతం మార్కెట్ వాటాతో భారతీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్లో అగ్రగామిగా ఉన్న ఓలా ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లపై దృష్టి సారిస్తోందట. ఓలా ఎస్1, ఎస్1 ప్రో, ఎస్1 ఎయిర్, ఎస్1 ఎక్స్ స్కూటర్ల అమ్మకాల్లో ఓలా తన ప్రత్యేకతను నిరూపించుకున్న విషయం తెలిసిందే.

ఓలా ఎలక్ట్రిక్ తమ మొదటి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్‌ను 2026 ఆర్థిక సంవత్సరం మొదట్లో విడుదల చేసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మరి ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాల్లోకి వెళితే.. ఓలా కొత్త మోటార్ సైకిల్ మోడల్స్ డైమండ్ హెడ్, అడ్వెంచర్, రోడ్ స్టర్, క్రూయిజర్ వంటి పేర్లతో రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇప్పటివరకూ టూ వీలర్ ఈవీ మార్కెట్‌లో కేవలం స్కూటర్ల విభాగంతోనే టాప్ ప్లేస్‌కు చేరిన తాము ఈవీ బైక్స్ లాంచ్‌తో మరింత ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్లు ఓలా ప్రతినిధులు తెలిపారు. ముఖ్యంగా బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలతో ఈ స్కూటర్లను లాంచ్ చేసే అవకాశం ఉంది.

గత సంవత్సరం ఎం1 సైబర్ రేసర్ కాన్సెప్ట్ను ఆవిష్కరించిన తర్వాత, ఓలా రోడ్ స్టర్ కోసం వారి పేటెంట్ దాఖలు చేశారు. రోడ్ స్టర్ బోల్డ్, స్పోర్టీ లుక్‌తో ఆకర్షిస్తుంది. యూఎస్‌డీ ఫోర్బ్స్, ట్విన్-డిస్క్ బ్రేక్ సెటప్‌తో వచ్చే ఓలా రోడ్ స్టర్ ర్యాప్రౌండ్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్, ట్యాంక్ ప్రౌడ్స్ పై ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ వింకర్లు ఆకర్షిస్తున్నాయి. ప్రత్యేకమైన మూడు దశల సీట్ డిజైన్‌తో కూడిన ఛార్జింగ్ పాడ్ రైడర్లను విపరీతంగా ఆకర్షిస్తుంది. ఫ్లష్-ఫిట్ టెయిల్ లైట్ యూనిట్ ఆధునిక డిజైన్‌తో వస్తుంది. ఓలా తమ నాలుగు ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ మోడల్ ల కోసం ఒక సాధారణ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించాలని యోచిస్తోంది. ముఖ్యంగా ఈ మోడల్ బైక్స్ బ్యాటరీ, మౌంటెడ్ మోటార్ స్పెసిఫికేషన్లలో స్థిరత్వాన్ని నిర్ధారిస్తుంది. అయితే ప్రతి మోడల్ విభిన్న మైన రైడింగ్ అవసరాలను తీర్చడానికి ప్రత్యేకమైన పవర్, రేంజ్ ఆప్షన్లను అందిస్తుంది.

Exit mobile version