RS 500 CRORES : 4 ఈ -స్కూటర్ కంపెనీలకు రూ. 500 కోట్లు.. ఎందుకు ఇస్తున్నారంటే ?

ఆ నాలుగు ఈ -స్కూటర్ కంపెనీలకు గుడ్ న్యూస్!! కేంద్ర ప్రభుత్వం వాటికి రూ.500 కోట్లు (RS 500 CRORES) ఇవ్వనుంది. గవర్నమెంట్ ఎందుకు ఆ పేమెంట్ చేస్తోంది అనుకుంటున్నారా ?

  • Written By:
  • Publish Date - May 9, 2023 / 09:11 AM IST

ఆ నాలుగు ఈ -స్కూటర్ కంపెనీలకు గుడ్ న్యూస్!! కేంద్ర ప్రభుత్వం వాటికి రూ.500 కోట్లు (RS 500 CRORES) ఇవ్వనుంది. గవర్నమెంట్ ఎందుకు ఆ పేమెంట్ చేస్తోంది అనుకుంటున్నారా ? FAME II అనే ఒక స్కీం ఉంది. FAME అంటే ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. దేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ, సేల్స్ ను ప్రోత్సహించేందుకు FAME -1 స్కీంను 2015లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఆ పథకం 2019లో ముగిసింది. దీంతో 2019లోనే రూ. 10,000 కోట్ల సబ్సిడీ నిధితో FAME- 2 స్కీంను కేంద్రం అనౌన్స్ చేసింది. ఈ స్కీం అమలులో భాగంగానే ఇప్పుడు రూ.500 కోట్ల(RS 500 CRORES)ను నాలుగు ఈ -స్కూటర్ కంపెనీలకు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ ఇస్తోంది. ఏ పేమెంట్ పొందుతున్న జాబితాలో మొదటి స్థానంలో ఓలా (OLA) కంపెనీ ఉంది. దానికి అత్యధికంగా రూ. 370 కోట్లు FAME- 2 స్కీం సబ్సిడీ కింద అందుతాయి. ఏథర్‌ (ATHER) కంపెనీకి దాదాపు రూ. 275 కోట్లు, టీవీఎస్ (TVS)కు రూ.150 కోట్లకు పైగా FAME- 2 స్కీం సబ్సిడీ లభిస్తుంది. హీరో మోటోకార్ప్‌కు చెల్లించాల్సిన సబ్సిడీ బిల్లు రూ. 28-30 కోట్లుగా ఉండొచ్చని అంటున్నారు.

ALSO READ : Ola Offers: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ పైన రూ.49,000 తగ్గింపు ఆఫర్లు!

ఎందుకు .. ఏమిటి ?

ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ కంపెనీల నుంచి ఛార్జర్లు కొనేందుకు కొనుగోలుదారులు గతంలో అదనంగా డబ్బులు చెల్లించారు. ఆ డబ్బులను ఛార్జర్ల కొనుగోలుదారులకు తిరిగి చెల్లిస్తేనే (రీయింబర్స్ చేస్తేనే) FAME- 2 స్కీం సబ్సిడీ రిలీజ్ చేస్తామని కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ బైక్స్, స్కూటర్ల కంపెనీలకు షరతు పెట్టింది . రూ. 1.50 లక్షల కంటే ఎక్కువ ధర ఉన్న ఎలక్ట్రిక్ వెహికల్ బిల్లింగ్ పై మాత్రమే FAME- 2 స్కీం సబ్సిడీ లభిస్తుందని స్పష్టము చేసింది. అయితే గత ఏడాదిన్నర కాలంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ కంపెనీలు ఛార్జర్ బిల్లు సెపరేట్ గా .. ఎలక్ట్రిక్ స్కూటర్ / బైక్ బిల్లు సెపరేట్ గా ఇస్తున్నాయి. దీనివల్ల బిల్లు రూ. 1.50 లక్షలను దాటలేదు. ఇప్పుడు కస్టమర్స్ కు ఛార్జర్ డబ్బులను తిరిగి పే చేయడం ద్వారా కంపెనీలు ఒక్కో బైక్ సేల్ బిల్లును లక్షన్నర దాటించనున్నాయి. ఫలితంగా ఓ వైపు లక్షలాది మంది కొనుగోలుదారులకు .. మరోవైపు ఎలక్ట్రిక్ వాహన కంపెనీలకు ఎంతో లబ్ది చేకూరుతుంది. ఈక్రమంలోనే తాజగా కంపెనీలు తమ దగ్గర ఛార్జర్ కొన్న వాళ్లందరికీ డబ్బులను రీయింబర్స్ చేస్తామని ప్రకటించాయి. కొన్ని కంపెనీలు ఈ ప్రాసెస్ ను ఇప్పటికే మొదలుపెట్టాయి. ఏథర్ 450X మోడల్ ఎలక్ట్రిక్ టూ వీలర్‌ తో పాటు ఛార్జర్ ను కొనుగోలు చేసిన 95,000 మంది కొనుగోలుదారులకు దాదాపు రూ. 140 కోట్లను రీయింబర్స్‌మెంట్ చేసేందుకు ఏథర్ రెడీ అయింది. Ola S1Pro కొన్న దాదాపు లక్ష మంది కొనుగోలుదారులకు దాదాపు 130 కోట్ల బిల్లును క్లియర్ చేసేందుకు Ola రెడీ అయింది. దీంతో అవి FAME- 2 స్కీం సబ్సిడీ అమౌంట్ పొందేందుకు లైన్ క్లియర్ అయింది. కాగా, ఈ ఆర్థిక సంవత్సరం (2023-24)లో రూ. 5,000 కోట్ల మేర FAME- 2 స్కీం సబ్సిడీ బిల్లులను క్లియర్ చేయాలని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ టార్గెట్ గా పెట్టుకుంది.